మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో హై అలర్ట్

మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల్లో హై అలర్ట్ జారీ అయింది.ఈ మేరకు మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

పీఎల్జీఏ వారోత్సవాల నిర్వహణతో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.తెలంగాణతో పాటు ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలలో కేంద్ర బలగాలతో జల్లెడ పడుతున్నారు.

అలాగే ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.సరిహద్దు ప్రాంతాలలో డ్రోన్ తో పర్యవేక్షిస్తున్నారు.

ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

అలాగే గోదావరి అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు కీలక నేతలు సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ క్రమంలోనే వాహన తనిఖీలు చేస్తున్నారు.

భారతీయులకు ఇజ్రాయెల్ గుడ్‌న్యూస్ .. అందుబాటులోకి ‘ఈ-వీసా’, దరఖాస్తు ఎలా అంటే?