లివర్ ఆరోగ్యాన్ని కాపాడే మందారం టీ.. ఆ జ‌బ్బులు కూడా దూరం?

మానవ శరీరంలో అత్యంత ముఖ్య‌మైన అవ‌య‌వాల్లో లివ‌ర్ (కాలేయం) ఒక‌టి.మ‌న శ‌రీరంలో నిరంత‌రాయంగా ప‌ని చేసే ఈ లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం.

అయితే నేటి కాలంలో చాలా మంది లివ‌ర్ సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డుతున్నారు.

ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, మ‌ద్యం అల‌వాటు, ధూమపానం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం దెబ్బ తింటుంది.

దాంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.ఒక్కో సారి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వ‌స్తుంది.

అంత వ‌ర‌కు తెచ్చుకోకూడ‌దంటే.ముందు నుంచే ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు లివ‌ర్ ఆరోగ్యాన్ని కాపాడ‌టంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.అలాంటి వాటిలో మందారం టీ ఒక‌టి.

అవును, మందారం టీనే.సాధార‌ణంగా చాలా మంది మందారం పువ్వుల‌ను అల‌క‌ర‌ణ‌కు మాత్ర‌మే ఉప‌యోగిస్తారు.

కానీ, మందారం పువ్వులు ఆరోగ్య ప‌రంగా మ‌రియు సౌంద‌ర్య ప‌రంగా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తుంది.

ముఖ్యంగా మందారాల‌తో త‌యారు చేసిన టీ సేవిస్తే బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.

"""/" / మందారం పువ్వుల రేక‌ల‌ను బాగా ఎండ‌బెట్టి పొడి చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ పొడిని నీటిలో వేసి బాగా మ‌రిగించి.

వ‌డ‌గ‌ట్టుకుని తేనె మ‌రియు నిమ్మ‌ర‌సం క‌లుపుకోవాలి.గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత ఈ మందారం టీని సేవించాలి.

ప్ర‌తి రోజు ఒక క‌ప్పు మందారం టీ తీసుకుంటే.అందులో యాంటీ ఆక్సిడెంట్స్ లివ‌ర్ వ్యాధిల‌ను నివారిస్తుంది.

మ‌రియు లివ‌ర్‌లో ఉండే కొవ్వును క‌రిగించే.దాని ప‌ని తీరును మెరుగు ప‌డేందుకు స‌హాయ‌ప‌డుతుంది.

అంతేకాదు, మందారం టీ సేవించ‌డం వ‌ల్ల‌.ర‌క్త పోటు అదుపులో ఉంటుంది.

అధిక బ‌రువును నియంత్రిస్తుంది.అలాగే ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగించి.

హార్ట్ ఎటాక్ వ‌చ్చే రిస్క్‌ను త‌గ్గిస్తుంది.ఇక మందారం టీలో ఉండే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేస్తుంది.

KCR : మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ను తనిఖీ చేయాలి..: కాంగ్రెస్ నేతలు