ఈ విధంగా షాంపూ చేసుకుంటే నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా మారుతుంది!
TeluguStop.com
అందాన్ని రెట్టింపు చేసే వాటిల్లో జుట్టు ఒకటి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా ఉంటే చూపరులకు ఎంతో అట్రాక్టివ్ గా కనిపిస్తారు.
అందుకే దాదాపు ప్రతి ఒక్క అమ్మాయి ఒత్తైన మరియు పొడవైన జుట్టు కోసం ఆరాట పడుతుంటుంది.
అయితే ఇప్పుడు చెప్పబోయే విధంగా షాంపూ చేసుకుంటే నెల రోజుల్లో మీరు కోరుకున్నట్లుగా మీ జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా మారుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా షాంపూ చేసుకుంటే ఒత్తెన మరియు పొడవాటి జుట్టును పొందచ్చో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి లోపల ఉండే జెల్ ను స్పూన్ సహాయంతో సపరేట్ చేసుకోవాలి.
అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ని తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో అలోవెరా జెల్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
"""/"/
అలాగే రెండు మందార పువ్వులు, రెండు మందార ఆకులు తుంచి వేసుకోవాలి.
చివరగా గుప్పెడు ప్రెష్ కరివేపాకు వేసుకుని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి పల్చటి వస్త్రం సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల రెగ్యులర్ షాంపూను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఈ విధంగా షాంపూ చేసుకుంటే జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.
జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి.అదే సమయంలో జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా పెరుగుతుంది.
చుండ్రు సమస్య ఉన్న సరే దూరం అవుతుంది.మరియు కేశాలు సిల్కీగా సైతం మారతాయి.
75 వేల కోసం ప్రాణాలు కోల్పోయిన థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్.. అసలేం జరిగిందో చూస్తే?