మందారం ఆకుల‌తో ఇలా చేస్తే.. ఎలాంటి జుట్టు స‌మ‌స్య‌లైనా దూరం!

జుట్టు ఒత్తుగా, పొడుగ్గా, అందంగా ఉండాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, ఎప్పుడు ఏదో ఒక స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

చుండ్రు, జుట్టు పొట్లిపోవ‌డం, ఎక్కువ‌గా జుట్టు రాల‌డం, కేశాలు డ్రైగా మారిపోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు వెంటాడుతుంటాయి.

ఈ స‌మ‌స్య‌లు పోగొట్టుకునేందుకు త‌ర‌చూ షాంపూలు మారుస్తూ ఉంటారు.అయిన‌ప్ప‌టికీ, ఫలితం లేకుంటే బాధ ప‌డ‌తారు.

అయితే ఎలాంటి జుట్టు స‌మ‌స్య‌లైనా పోగొట్ట‌డంలో మందారం ఆకులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఇంత‌కీ మందారం ఆకుల‌ను కేశాల‌కు ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా కొన్ని మందారం ఆకుల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో కొద్దిగా క‌ల‌బంద గుజ్జు మిక్స్ చేసి.

త‌ల‌కు మ‌రియు కేశాల‌కు బాగా ప‌ట్టించాలి.అర గంట పాటు అలా వ‌దిలేసి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.

చుండ్రు స‌మ‌స్య త‌గ్గ‌డంతో పాటు జుట్టు రాల‌డం కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది. """/" / అలాగే కొన్ని మందారం ఆకుల‌ను మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకుని.

అందులో కొద్దిగా పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు అప్లై చేసి.

అర గంట నుంచి గంట పాటు ఆరిపోనివ్వాలి.అనంత‌రం సాధార‌ణ షాంపూతో త‌ల స్నానం చేయాలి.

ఇలా వారానికి ఒక‌టి లేదా రెండు సార్లు చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

అదేవిధంగా, డ్రైగా ఉన్న జుట్టును సిల్కీగా మార్చుకోవాలి అని భావించే వారు.మందారం ఆకుల‌ను పేస్ట్ చేసుకుని.

అందులో గోరు వెచ్చ‌టి కొబ్బ‌రి నూనె వేసి మిక్స్ చేయాలి.ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు బాగా ప‌ట్టించి.

అర‌గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

ఇలా త‌ర‌చూ చేస్తే.కేశాలు సిల్కీగా మారుతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే7, మంగళవారం 2024