Hi Nanna : నాని హాయ్ నాన్న మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. నాని ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరినట్టేనా?

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని ( Nani )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నాని ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే దసరా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాని ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు నాని.శౌర్యువ్ దర్శకత్వం వహించిన హాయ్ నాన్న( Hi Nanna ) సినిమాలో హీరోగా నటించారు.

ఇందులో మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur )హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.

"""/" / ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

అంతేకాకుండా హీరో నాని ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.

ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఈ సినిమా కోసం నాని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే దసరా సినిమాలో ఫుల్ మాస్ రోల్ లో కనిపించిన నాని ఈ సినిమాలో క్లాస్ గా కనిపించనున్నాడు.

తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందిన.ఈ సినిమాలో బలమైన భావోద్వేగాలు ఉంటాయని ప్రచార చిత్రాలతోనే అర్థమైపోయింది.

"""/" / ఇప్పటికే సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.

ఈ సినిమాలో బ్యూటిఫుల్ ఎమోషన్స్‌ ఉన్నాయట.ముఖ్యంగా నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారాల ( Mrunal Thakur Kiara Khanna ) కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కట్టి పడేస్తాయట.

నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా సినిమాకి ప్రధాన బలంగా నిలిచిందట.నాని, మృణాల్ లతో పోటీ పడుతూ బేబీ కియారా తన నటనతో సర్ ప్రైజ్ చేసిందట.

మొత్తానికి ఈ సినిమాకి నాని కెరీర్ లో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీగా మిలిగిపోతుందని ఇండస్ట్రీ టాక్.

తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని సెన్సార్ సభ్యులు చెప్పినట్టు తెలుస్తోంది.

బోస్టన్‌లోనూ “చుట్టమల్లే” సాంగ్ ఫీవర్.. టెరిఫిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు!