అరుదైన అవార్డుకు ఎంపికైన నాని హాయ్ నాన్న మూవీ.. సంతోషంలో చిత్ర బృందం?

ఇటీవల నాచురల్ స్టార్ నాని( Nani )హీరోగా నటి మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్ గా నూతన దర్శకుడు శౌర్యువ్ ( Shouryuv ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్నా( Hai Nanna ).

కియరా ఖన్నా బాలనటిగా నటించినటువంటి ఈ సినిమా గతేడాది డిసెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఒక తండ్రి కూతురు మధ్య కొనసాగే అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా తాజాగా మరో అవార్డును అందుకుంది.

"""/" / హాయ్ నాన్న సినిమాగా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అంతర్జాతీయంగా హాయ్ డాడ్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌ మార్చ్ 2024 ఎడిషన్‌లో బెస్ట్ ఫీచర్ ఫిలింగా( Best  Feature Film Award ) అవార్డును కైవసం చేసుకుంది.

ఈ సినిమాకు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

"""/" / ఈ సందర్భంగా డైరెక్టర్ శౌర్యువ్‌ మాట్లాడుతూ.'ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో లభించిన ఈ గుర్తింపు మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని తెలిపారు.

సాంస్కృతిక సరిహద్దులను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న  ప్రేక్షకులకు మా సినిమా చాలా బాగా కనెక్ట్ అయిందని మా సినిమాకు ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

మా సినిమాకు ఇలాంటి అవార్డు ఇచ్చిన జ్యూరీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడమే కాకుండా చిత్ర బృందానికి కూడా ధన్యవాదాలు తెలిపారు.

ఆరోజు అందుకే కళ్యాణ్ మామయ్యను ఎత్తుకున్నాను: సాయి ధరమ్ తేజ్