సాయి పల్లవి తో పాటు ఎక్కువ ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న హీరోయిన్స్ వీరే !

సౌతిండియన్ హీరోయిన్ సాయిపల్లవి( Sai Pallavi ) చాలా అందంగా ఉంటుంది.మంచిగా డ్యాన్స్ చేస్తుంది.

అంతకుమించి అద్భుతంగా నటిస్తుంది.అందుకే ఆమెను ఎక్కువసార్లు ఫిలిమ్ ఫేర్ అవార్డులు( Film Fare Awards ) వరించాయి.

ఈ ఘనత సాధించినందుకు గానూ టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఓ స్టూడియోలో ఆమెను సత్కరించాడు.

బాగా నటిస్తున్నావమ్మా అంటూ అభినందించాడు.ఈ ముద్దుగుమ్మ "గార్గి" సినిమా తర్వాత పెద్దగా వార్తల్లో కనిపించలేదు.

ఈ అందాల తార ప్రస్తుతం తెలుగులో తండేల్ సినిమా చేస్తోంది.హిందీలో రామాయణం మూవీ చేస్తోంది.

ఇందులో సీత పాత్రలో మెరవనుంది.ఇక సాయి పల్లవి మొత్తంగా 6 ఫిలిమ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది.

అన్ని బెస్ట్ యాక్ట్రెస్‌ అవార్డులే! ఇందులో ఒకటి డెబ్ల్యూ కేటగిరీ కింద అందుకోగా, రెండు క్రిటిక్స్ కేటగిరీ కింద సొంతం చేసుకుంది.

ప్రేమ‌మ్, ఫిదా, ల‌వ్ స్టోరీ, శ్యామ్ సింగ‌రాయ్, గార్గి, విరాట‌ప‌ర్వం సినిమాల్లో బాగా నటించినందుకు ఈ పురస్కారాలు వచ్చాయి.

"""/" / ఈ సినీ తార తర్వాత సౌత్ ఇండియాలో ఎక్కువ ఫిలిమ్ ఫేర్ అవార్డులు దక్కించుకున్న హీరోయిన్లు నయనతార,( Nayantara ) త్రిష.

( Trisha ) నిజానికి వీళ్లు చాలా ఏళ్లుగా సినిమా రంగంలో ఉన్నారు.

సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొన్నేళ్ళే అవుతోంది.చేసిన సినిమాలు కూడా తక్కువే.

అయినా ఆమె అందరికంటే ఎక్కువగా, ఏకంగా ఆరు అవార్డులు పొందడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు.

"""/" / నయనతార 20 ఏళ్లలో 14 సార్లు ఫిలిమ్ ఫేర్ అవార్డులకు నామినేట్ అయితే గెలుచుకున్నది జస్ట్ 5 మాత్రమే.

ఇక త్రిష చాలా సీనియర్ హీరోయిన్.కానీ కేవలం 10 సార్లు మాత్రమే నామినేట్ అయ్యింది.

ఇక గెలుచుకున్నది అయిదు ఫిలిమ్ ఫేర్లు మాత్రమే.అంటే ఈ సీనియర్ హీరోయిన్లను కూడా సాయిపల్లవి సింపుల్‌గా బీట్‌ చేసేసింది.

బాలీవుడ్‌ చరిత్రలోనూ ఆరుసార్లు ఫిలిమ్ ఫేర్లు అందుకున్న నటీమణి ఎవరూ లేరు. """/" / నూతన్,( Nutan ) కాజోల్,( Kajol ) ఆలియా భట్( Alia Bhatt ) ఒక్కొక్కరూ ఐదు అవార్డులు గెలుచుకున్నారు.

రామాయణం సినిమా తర్వాత హిందీలో సాయిపల్లవి, ఆలియా భట్‌కు పోటీ కావచ్చు.మీనాకుమారి, మాధురీ దీక్షిత్, విద్యాబాలన్ నాలుగు అవార్డులతో సరిపెట్టుకున్నారు.

"""/" / వహీదా రెహమాన్, డింపుల్ కపాడియా, రేఖ, శ్రీదేవి, కరిష్మా కపూర్, ఐశ్వర్యరాయ్, రాణి ముఖర్జీ, దీపిక పడుకునే వంటి స్టార్ హీరోయిన్లు కూడా కేవలం రెండుసార్లు మాత్రమే ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నారు.

ఈ చరిత్ర మొత్తం చూస్తుంటే సాయిపల్లవి అరుదైన ఘనత సాధించిందని చెప్పవచ్చు నిజంగా ఆమె దీనికి అర్హురాలు.

మంచి పాత్రలు ఎన్నుకుంటూ చక్కగా నటిస్తూ అందరి మనసులను ఈ ముద్దుగుమ్మ గెలుచుకుంది.

ప్రభుత్వం అందించే ప్రాంతీయ, జాతీయ అవార్డులకన్నా ఫిలిమ్ ఫేర్ అవార్డులకు వాల్యూ చాలా ఎక్కువ అని కొంతమంది అంటారు.

ఏది ఏమైనా సాయి పల్లవి మహానటి సావిత్రి లాగా గొప్ప పేరు తెచ్చుకుంటోంది.

వామ్మో.. అమెరికాలో ఎంత భారీ హనుమంతుడి విగ్రహమో..