Tripti Dimri : 2023లో భారీ సక్సెస్ లు సాధించిన హీరోయిన్లు వీరే..!

2023వ సంవత్సరం చివరి అంకానికి చేరుకుంది.ఈ సంవత్సరంలో వందల సంఖ్యలో టాలీవుడ్ సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి.

రైటర్ పద్మభూషణ్, సార్, వినరో భాగ్యము విష్ణు కథ, బలగం, దసరా, విరూపాక్ష, సామజవరగమన, బేబీ, భగవంత్‌ కేసరి, హాయ్ నాన్న వంటి కొన్ని సినిమాలు మాత్రమే బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి.

ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలతో తెలుగులో బాగా సక్సెస్ అయిన హీరోయిన్లు కూడా ఉన్నారు.

నిజానికి ఈ రోజుల్లో ఇతర భాషల సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతూ సూపర్ హిట్ అవుతున్నాయి.

ముఖ్యంగా బాలీవుడ్ మూవీలు.షారుఖ్ నటించిన పటాన్, జవాన్ సినిమాలు తెలుగులో ఎంత పెద్ద హిట్స్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

"""/" / ఇక ఇటీవల తెలుగులో డబ్ అయిన యానిమల్ సినిమా కూడా సూపర్ హిట్ అయినది.

ఈ మూవీలో ఒక కీలక పాత్ర పోషించిన ఉత్తరాఖండ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి( Tripti Dimri ) తెలుగులో యమ క్రేజ్ తెచ్చుకుంది.

ఒక్క టాలీవుడ్ సినిమాల్లో ఇప్పటిదాకా నటించిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది ఒక్కసారిగా సక్సెస్ సాధించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు తెలుగులో చాలా ఆఫర్లు క్యూ కడుతున్నాయి.అలానే ఈ ఇయర్ బాగా సక్సెస్ సాధించిన హీరోయిన్లలో శ్రుతిహాసన్( Shruti Haasan ) మొదటి వరుసలో ఉంటుందని చెప్పుకోవచ్చు.

ఈ అందాల తార 2023 ప్రారంభంలో విడుదలైన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది.

దాంతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన "హాయ్ నాన్న" సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసి అలరించింది.

త్వరలో ఈ ముద్దుగుమ్మ సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.ఆ సినిమా హిట్ అయితే ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తాయని అనడంలో సందేహం లేదు.

"""/" / ఇక ఏడాది అత్యధిక సక్సెస్ అందుకున్న మరో హీరోయిన్ సంయుక్త మీనన్( Samyuktha Menon ) అని చెప్పుకోవచ్చు.

ఈ మలయాళ బ్యూటీ సార్, విరుపాక్ష సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం ఈ కుందనపు బొమ్మ కళ్యాణ్ రామ్ తో కలిసి డెవిల్ సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమా హిట్ అయితే తెలుగులో ఈ తార హాట్ ట్రిక్ కొట్టినట్లే అవుతుంది.

ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క సక్సెస్ సాధిస్తే బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య అదిరిపోయే విజయం సాధించింది.

సామజవరగమన మూవీతో మౌనిక రెబా జాన్, దసరా చిత్రంతో కీర్తి సురేష్, హాయ్ నాన్న సినిమాతో మృణాల్ ఠాకూర్లు కూడా మంచి విజయాలను అందుకున్నారు.