ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఫోర్నోగ్రఫీ కేసులో ఇరుక్కున్నాడు.
ఫోర్న్ వీడియోల నిర్మాణంలో ఆయన పాత్ర ఉన్నట్లు తేలడంతో తనను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
ఈ అరెస్టు బీటౌన్ లో సంచలనం రేపుతుంది.బాలీవుడ్ లోని ఏఏ తారలతో కుంద్రాకు సంబందాలున్నాయి అనే యాంగిల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు.
మరోవైపు కుంద్రాతో టచ్ లో ఉన్న వారు తమ పేరు ఎక్కడ బయట పడుతుందోనని భయంతో వణుకుతున్నారు.
అటు ఈ కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్లను పోలీసులు విచారించారు.
పూనం పాండే, షెర్లీన్ చోప్రా, గెహనా వశిష్ట్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.ఈ ముగ్గురు కుంద్రాతో కలిసి పనిచేసినట్లు పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ ముగ్గురు బాలీవుడ్ లో హాట్ స్టార్స్ గా గుర్తింపు పొందారు.
కుంద్రాతో కొన్ని అశ్లీల వీడియోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు.అయితే కొంతకాలంగా తనతో టచ్ లో లేమని వెల్లడించారట.
అటు పూనమ్ ఆయనతో కొంతకాలం కలిసి పనిచేసినా.ఆ తర్వాత ఆర్థిక అంశాల్లో గొడవలు రావడంతో తన కంపెనీతో తెగదెంపులు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు.కుంద్రా టీమ్ కలిసి పలు పోర్న్ సైట్స్ లో తన ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్ చెయ్యడంతో పాటు తన పర్సనల్ మొబైల్ నెంబర్ పెట్టారంటూ పూనం గతంలో కుంద్రాపై కేసు పెట్టింది.
అటుకుంద్రా విచారణలో ఎవరి పేర్లు బయటకు వస్తాయోనని అతడితో క్లోజ్ గా మెలిగిన బాలీవుడ్ స్టార్స్ భయపడుతున్నారు.
"""/"/
లండన్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన కుంద్రాకు.పోర్నోగ్రఫీ కేసులో జూలై 23 వరకు కోర్టు రిమాండ్ విధించింది.
లైవ్ స్ట్రీమింగ్ యాప్ లు, ఐపీఎల్ కలిసి రాకపోవడంతో తప్పుదారిలో సంపాదన కోసం రాజ్ అడ్డదారులు తొక్కాడు.
అశ్లీల కంటెంట్ ను కొన్ని యాప్ ల ద్వారా జనాల్లోకి తీసుకెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ముంబై మోడల్స్ ను ట్రాప్ చేసి.వారి అశ్లీల వీడియోలను హాట్ షాట్స్ అనే యాప్ ద్వారా ప్రసారం చేసినట్లు తేలింది.
ఫిబ్రవరి 2019 లో రాజ్ కుంద్రా ఆర్మ్స్ ప్రైమ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను మొదలు పెట్టాడు.
6 నెలల తర్వాత ఈ కంపెనీ హాట్ షాట్ అనే యాప్ ను అభివృద్ధి చేసింది.
ఈ యాప్ కుంద్రా యొక్క బంధువు పర్దీప్ బక్షి యాజమాన్యంలోని లండన్ కేంద్రంగా ఉన్న కెన్రిన్ లిమిటెడ్‌కు 25 వేల డాలర్లకు అమ్మారు.
2019 డిసెంబర్‌లో కుంద్రా ఆర్మ్స్ ప్రైమ్ మీడియాకు రిజైన్ చేశాడు.అయితే కుంద్రా మూడు వాట్సాప్ గ్రూపుల ద్వారా హాట్ షాట్ యాప్ ఆపరేషన్‌ను నిర్వహించాడు.
ఈ యాప్ లో అశ్లీల కంటెంట్ మూలంగా ఆప్ స్టోర్.ప్లే స్టోర్ దీన్ని తొలగించాయి.
ఇప్పటి వరకు పోర్నోగ్రఫీ కంటెంట్ ను అప్లోడ్ చేస్తున్నారన్న ఆరోపణలతో రాజ్ కుంద్రా తో పాటు 11 మంది అరెస్ట్ చేశారు పోలీసులు.
బాలీవుడ్ ను కుదిపేసిన ఈ కేసులో నటి శిల్పాశెట్టి పాత్ర లేనట్టుగా పోలీసులు వెల్లడించారు.
పాడుతా తీయగా షోలో బయటపడ్డ చీకటి కోణం… అక్కడ కూడా ఎక్స్ పోజ్ చేయాల్సిందేనా?