Kasthuri Anasuya: ఈ నటీమణులు ఏది దాచుకోరు.. నచ్చకపోతే తిట్టేయడమే ..!
TeluguStop.com
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో పనిచేసే నటీమణులు మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
హీరోలు, దర్శకులు, నిర్మాతలు, తోటి నటులు ఇలా ఏ ఒక్కరి గురించి వారు తప్పుగా మాట్లాడరు.
ఎవరి గురించేనా నెగిటివ్ గా మాట్లాడితే ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా తొక్కేస్తారేమోనని భయపడుతుంటారు.
అందుకే ఏ ఇంటర్వ్యూలోనైనా, బయటైనా సినిమా వారి గురించి మంచి మాటలే చెబుతారు.
అయితే కొందరు ఎవరికీ భయపడరు.తమకి ఏది అనిపిస్తే అది బయటకి అనేస్తుంటారు.
అలాంటి వారిలో తమిళ నటి కస్తూరి( Actress Kasthuri ) ఒకటి.ఆమె సినిమాల మీదనే కాదు రాజకీయ, సామాజిక అంశాలపై ధైర్యంగా మాట్లాడుతుంది.
అవసరమైతే నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తుంది.ఎవరు ఏమనుకున్నా తనకేంటి అన్నట్లు ఆమె ధోరణి ఉంటుంది.
"""/" /
తాజాగా ఈ ముద్దుగుమ్మ "యానిమల్ సినిమాలో( Animal Movie ) ఏముంది? విసుగు తెప్పించడం తప్ప ఈ సినిమా వినోదాన్ని పంచింది లేదు.
" అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా నిర్భయంగా చెప్పింది.మూడు గంటలు ఉన్న ఈ సినిమా ఒకటిన్నర గంటలు చూసేసరికి తనకి విసుగు వచ్చేసిందని, అంతకుమించి సినిమా చూడటం భారంగా అనిపించిందని ఆమె ఎక్స్ లో ఒక పోస్ట్ ద్వారా తెలిపింది.
"""/" /
సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) ఫిలిం మేకింగ్ టాప్ నాచ్ లో ఉందని కానీ సినిమా ఎంటర్టైన్ చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆమె కుండ బద్దలు కొట్టినట్లు తన అభిప్రాయం చెప్పింది.
కొన్ని సన్నివేశాలు అసలు అర్థం కాలేదని, ఆటో ప్లేన్ వెళ్తున్న సమయంలో వచ్చిన హాట్ సన్నివేశాలు, మిగతా రొమాన్స్ సన్నివేశాలు, మాట్లాడుకునే సీన్లు చూస్తుంటే ఒక జంతువు లాగా యాక్టర్స్ ప్రవర్తించారనిపించిందని అన్నది.
ఈ సినిమా అసలే చూడలేకపోయాను అన్నట్లు ఆమె తన అభిప్రాయాన్ని తెలిపింది. """/" /
సాధారణంగా ఒక హీరో సినిమాని ఎవరైనా సెలబ్రిటీ విమర్శిస్తే వారిని ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తారు.
అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సమయంలో అనసూయ( Anasuya ) కూడా అలాంటి ట్రోల్స్ బారిన పడింది.
ఇది ఎవరికైనా సహజంగా జరిగేది.అందుకే చాలామంది తమలోని అభిప్రాయాలను మనసులోనే ఉంచుకుంటారు.
తమిళం నటి కస్తూరి మాత్రం పబ్లిక్ గా యానిమల్ సినిమాని కడిగిపారేసింది.ఇప్పుడు ఆమెను చాలా మంది పొగుడుతున్నారు.
ఇలా ధైర్యంగా రివ్యూ ఇచ్చే సెలబ్రిటీ మీరు ఒక్కరే అని ఆమెను ప్రశంసిస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా ఫ్యాన్స్ మాత్రం ఆమెను టార్గెట్ చేశారు.
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ