బాలీవుడ్ కి వెళ్ళగానే టాలీవుడ్ పై విపరీతమైన కామెంట్స్ చేసిన హీరోయిన్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి జీవితం ఇస్తుంది కానీ అది అందుకున్న తర్వాత అదే కృతజ్ఞతతో చాలామంది ఉండరు.

ఒక్కసారి టాలీవుడ్ లో స్టార్డం అనుభవించిన తర్వాత బాలీవుడ్ కి బాటలు వేసుకుంటారు.

ఆ తర్వాత అక్కడ సెటిలైపోయే ప్రయత్నంలో టాలీవుడ్ పై పిచ్చిపిచ్చి కామెంట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది నటీనటులు.

అందులో ఎక్కువగా హీరోయిన్స్ మాత్రమే ఉండడం విశేషం.తాము నడిచిన బాటనే మరచిపోయి అందలాన్ని అందుకోవాలనే ఆరాటంలో నోటికి వచ్చిన కామెంట్స్ చేసి సోషల్ మీడియా చేతిలో ట్రోలింగ్ చేయబడుతూ ఉంటారు.

అలా కొంతమంది స్టార్ హీరోయిన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాక టాలీవుడ్ పై కామెంట్ చేశారు.

వారు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. """/" / ఇటీవల కాలంలో ఈ తరహా కామెంట్స్ చేస్తున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది ముఖ్యంగా చూసుకుంటే ఆనిమల్ సినిమా తో క్రేజ్ అందుకున్న రష్మిక మందన( Rashmika Mandanna ) తెలుగు సినిమా ఇండస్ట్రీపై కొన్ని కామెంట్స్ చేసింది.

తెలుగు సినిమా అనగానే అవసరం ఉందా లేకపోయినా మాస్ మసాలా సాంగ్స్ లేదా ఐటెం సాంగ్స్ ఖచ్చితంగా ఉంటాయంటూ చాలా వెటకారం గా కామెంట్స్ చేసింది.

ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది.ఇక టాలీవుడ్ మొత్తం రెండు లేదా మూడు కుటుంబాల మధ్య మాత్రమే ఇరుక్కుపోయి ఉంది అంటూ అమలాపాల్( Amalapal ) కామెంట్స్ చేసింది.

అందువల్లే తాను తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటించబోయేది లేదు అంటూ కూడా ప్రకటించింది.

"""/" / ఇక ఇలియానా( Ileana ) కూడా ఈ లిస్ట్ లో ఉంది.

తన నడుము నీ తడమాలని ఉంది అంటూ చాలామంది దర్శకులు నిర్మాతలు అడిగారు అంటూ టాలీవుడ్ పరిశ్రమ గురించి బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఇలియానా కామెంట్స్ చేయడం విశేషం.

ఇదే దోవలో తాను తెలుగు సినిమా ఇండస్ట్రీ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఇకపై తెలుగు సినిమాల్లో నటించే అవకాశం ఏం లేదు అంటూ చాలా ఓపెన్ గా మరియు బోల్డ్ గా ప్రకటించింది హీరోయిన్ రాధిక ఆఫ్టే.

( Radhika Apte ) తాను తెలుగు సినిమా ఇండస్ట్రీలో పడ్డంత కష్టాలు ఎక్కడ పడలేదని అక్కడ హీరోయిన్స్ ని ట్రీట్ చేసే విధానం భయంకరంగా ఉంటుందంటూ చెప్పింది.

ఈ సిటీలో నాన్ వెజ్ తిన్నా, అమ్మినా నేరమే.. ఎక్కడంటే…?