Nagarjuna : నాగార్జున ను సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టిన హీరోయిన్ ఎవరి తెలుసా..?

అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) నట వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున చాలా తక్కువ సమయంలోనే బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకొని ఇండస్ట్రీలో యువ సామ్రాట్ నాగార్జునగా ఎదిగాడు.

ఇక ప్రస్తుతం కింగ్ నాగార్జున( King Nagarjuna ) గా పిలవబడుతున్న ఈయన ఇప్పుడు చేస్తున్న అన్ని సినిమాలు కూడా మినిమం గ్యారంటీ సినిమాలుగా మారుతున్నాయి.

అయితే ఈయన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా సంవత్సరాలవుతుంది.2016వ సంవత్సరంలో వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈయన ఆ తర్వాత ఇప్పటివరకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ ని కూడా కొట్టలేకపోయాడు.

"""/"/ ఇక ఇది ఇలా ఉంటే నాగార్జున ను సక్సెస్ ఫుల్ హీరో( Successful Hero )గా మార్చిన హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

నాగార్జున చాలామంది హీరోయిన్లతో సినిమాలు చేసినప్పటికీ ఒక్క హీరోయిన్ తో చేసిన సినిమాలు మాత్రం చాలా ఎక్కువ సంఖ్యలో విజయాలను అందుకున్నాయి.

ఆమెకి ఎవరు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో శివగామి( Shivagami )గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న రమ్యకృష్ణ( Ramya Krishna ) అనే చెప్పాలి.

వీళ్ళ కాంబినేషన్ లో ఘరానా బుల్లోడు,అల్లరి అల్లుడు, హలో బ్రదర్, అన్నమయ్య, సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు లాంటి సినిమాలు వచ్చి సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.

"""/"/ అయితే క్రిమినల్ సినిమా( Criminal Movie ) యావరేజ్ గా ఆడింది.

ఇలా నాగార్జున తన కెరియర్ లో చేసిన చాలా సినిమాల్లో తనకి అచ్చోచ్చిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రమ్యకృష్ణ అనే చెప్పాలి.

నాగార్జున కెరీయర్ డౌన్ అయిన ప్రతిసారి రమ్యకృష్ణతో చేసిన సినిమాలే ఆయనకి సూపర్ డూపర్ సక్సెస్ లను అందించాయి.

ఇక రీసెంట్ గా సోగ్గాడే చిన్నినాయన సినిమా( Soggade Chinni Nayana ) కూడా ఆయన కెరియర్ లో ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది.

అలాగే దానికి సీక్వెల్ గా వచ్చిన బంగార్రాజు సినిమాతో కూడా రమ్యకృష్ణ నాగార్జునకి మరో సక్సెస్ ను ఇచ్చింది.

భాగస్వామి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రష్మిక.. అలా చెప్పడంతో?