మాంసం కోసం మూగజీవులను హింసిస్తారిలా.. కన్నీళ్లు పెట్టించే వీడియో
TeluguStop.com
మన భారతీయ నటీనటులు సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక సమస్యలపైనా స్పందిస్తుంటారు.వారు చేసే ట్వీట్లు ప్రజలను ఆలోచింపజేస్తుంటాయి.
కాలానుగుణంగా మారాలనే దృక్పథాన్ని కలిగిస్తుంటాయి.ముఖ్యంగా జంతుహింసపై( Animal Cruelty ) ఇప్పటికే నాగార్జున భార్య అమల వంటి వారు చేసే ఉద్యమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఎక్కడైనా కుక్కలకు, ఇతర జంతువులకు హాని కలిగితే వారు ధర్నాలు సైతం చేస్తారు.
తాజాగా ఈ కోవలో ముంబై నటి వేదిక( Actress Vedhika ) చేరింది.
ఆమె పూర్తిగా శాకాహారి.ప్రజల్లో అవేర్‌నెస్ కోసం ఆమె పోరాడుతోంది.
ఇక తెలుగులో విజయదశమి సినిమాతో ఆమె తెరంగేట్రం చేసింది.ఆ తర్వాత తెలుగులో రూలర్, కాంచన-3, బాణం, బంగార్రాజు వంటి సినిమాలలో నటించింది.
అదే సమయంలో టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, మాలీ వుడ్, శాండల్ వుడ్ సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
మూగజీవాలను సంరక్షించేందుకు నటి వేదిక నడుం కట్టారు.గతంలో జీ20 సమావేశాల నిర్వహణ సందర్భంగా ఢిల్లీలో వీధి కుక్కలను( Stray Dogs ) బంధించినప్పుడు ఆమె చలించిపోయింది.
"""/" /
ఈ చర్య సరైంది కాదంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.
తాజాగా మాంసం కోసం( Meat ) మూగజీవాలను ఎలా హింసిస్తారో తెలిపే ఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కోళ్లు, మేకలు, ఆవులను మాంసం కోసం ఫామ్‌లలో హింసిస్తుంటారని, అంతా మాంసాహారం మానేయాలని పేర్కొంది.
జంతువులను సంరక్షించడంలో భాగం కావాలని పిలుపునిచ్చింది. """/" /
ఆమె పోస్ట్‌కు చాలా మంది నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.
అయితే వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతోంది.అందరూ శాకాహారులుగా( Vegetarians ) ఉండాలని ఎలా అడుగుతారని కొందరు నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు.
ఎవరి ఆహారపు అలవాట్లు వారివి అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.ఏదేమైనా జంతుహింసకు వ్యతిరేకంగా ఆమె తన గళం వినిపిస్తున్నారు.
త్వరలో ఆమె నటించిన రజాకార్ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది.
తేజ సజ్జా ‘మిరాయ్’ మూవీతో భారీ సక్సెస్ ను సాధిస్తాడా..?