Taapsee : తాప్సీకి కాబోయే భర్త బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసి తర్వాత రోజుల్లో టాలీవుడ్ పైనే విషం కక్కిన హీరోయిన్లలో తాప్సీ( Taapsee ) ఒకరు.
తాప్సీ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.అయితే తాప్సీ భర్త బ్యాగ్రౌండ్ గురించి తెలిసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతవుతోంది.
ఉదయ్ పూర్( Udaipur ) వేదికగా తాప్సీ మథియస్ బో పెళ్లి జరగనుందని భోగట్టా.
డంకీ సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్న తాప్సీ పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తారో లేదో తెలియాల్సి ఉంది.
"""/" /
మథియస్ బో( Mathews Bo ) డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కాగా 2014 సంవత్సరం నుంచే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది.
రాజ్ షమాని పాడ్ కాస్ట్( Raj Shamani Podcast ) సమయంలో తాప్సీ మథియన్ బోతో తన రిలేషన్ షిప్ ను రివీల్ చేశారు.
మథియస్ బో 1980 సంవత్సరంలో జన్మించారు.తాప్సీ, మథియన్ బో మధ్య ఏజ్ గ్యాప్ 8 సంవత్సరాలు అని సమాచారం అందుతోంది.
1998 సంవత్సరంలో మథియన్ బో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ లో అడుగు పెట్టారు. """/" /
యూపీపియన్ ఛాంపియన్ షిప్స్( UPIEPIAN CHAMPIONSHIPS ) 2006లో పురుషుల డబుల్స్ లో మథియన్ బో రజతం గెలిచారు.
2010 సంవత్సరంలో డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు నెగ్గడం గమనార్హం.2011 సంవత్సరంలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ లో చాంపియన్ గా అవతరించారు.
2012 లండన్ ఒలింపిక్స్ లో ఆయన రజత పతకం గెలిచారు.చైనాలో 2013 వరల్డ్ చాంపియన్ షిప్స్ లో ఆయన సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు.
"""/" /
2015 సంవత్సరంలో యూరోపియన్ గేమ్స్ లో ఆయన స్వర్ణ పతకం గెలిచారు.
2012, 2017 సంవత్సరాలలో యూరోపియన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్ లో ఆయన విజేతగా నిలిచారు.
2020 సంవత్సరంలో మథియన్ బో రిటైర్మెంట్ ప్రకటించారు.తర్వాత బ్యాడ్మింటన్ పై ఆసక్తి ఉన్నవాళ్లకు మథియన్ బో శిక్షణ ఇస్తున్నారు.
తాప్సీ భర్త బ్యాగ్రౌండ్ గురించి తెలిసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
మూడేళ్లు మొబైల్ కు దూరంగా ఉంటూ ఐఏఎస్.. నేహా బైద్వాల్ సక్సెస్ కు వావ్ అనాల్సిందే!