ఆ విషయంలో హీరోయిన్లు చాలా భయపడేవారు.. సుస్మితా సేన్ సంచలన వాఖ్యలు!

ప్రముఖ నటి సుస్మితా సేన్( Sushmita Sen ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

తన నటనతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఈ నటి తాజాగా హీరోయిన్ల వయస్సు( Heroines Age ) గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

తాజాగా తాలీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుస్మిత గతంలో హీరోయిన్లు వయస్సు విషయంలో భయపడేవారని అన్నారు.

వయస్సు పెరిగితే మూవీ ఆఫర్లు తగ్గుతాయని హీరోయిన్లు భావించేవారని సుస్మిత సేన్ చెప్పుకొచ్చారు.

అయితే అది నిజం కాదని ఆమె కామెంట్లు చేశారు.ఒకప్పుడు అలా భయపడాల్సి వచ్చేదని ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయని సుస్మితా సేన్ చెప్పుకొచ్చారు.

నేను నటించే ప్రతి రోల్ ఛాలెంజింగ్ గా( Challenging Roles ) ఉండాలని కోరుకుంటానని ఆమె అన్నారు.

ఆ రోల్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోవాలని అందుకోసం ప్రతి క్షణం కష్టపడతానని సుస్మితా సేన్ కామెంట్లు చేశారు.

"""/" / తాలీ వెబ్ సిరీస్( Taali Web Series ) కథ విన్న వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఆమె అన్నారు.

ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంతోషాన్ని కలిగిస్తోందని సుస్మితా సేన్ చెప్పుకొచ్చారు.

హార్ట్ ఎటాక్ వచ్చిన రోజుల గురించి ఆమె మాట్లాడుతూ నేను నా జీవితాన్ని ఎంతో ప్రేమిస్తానని అన్నారు.

ఆ రీజన్ వల్లే ఎంత కష్టాన్నైనా ఎదుర్కొన్నానని ఆమె కామెంట్లు చేశారు.గుండెపోటుకు గురైన సమయంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నానని సుస్మితా సేన్ తెలిపారు.

"""/" / ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆమె అన్నారు.తాలీ వెబ్ సిరీస్ ప్రస్తుతం జియో సినిమాలో( Jio Cinema ) స్ట్రీమింగ్ అవుతోంది.

సుస్మితా సేన్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.సుస్మితా సేన్ ను అభిమానించే వాళ్ల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతుండటం గమనార్హ్ం.

జడ్జిగా ఎంపికై గ్రామ తలరాతను మార్చిన అభిలాష జెఫ్.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!