ఖరీదైన కారు కొనుగోలు చేసిన విరూపాక్ష బ్యూటీ సోనియా.. కారు ఖరీదెంతంటే?
TeluguStop.com
సాయితేజ్( Saitej ) హీరోగా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో విరూపాక్ష ఒకటి.
ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించగా సోనియా సింగ్ కీలక పాత్రలో నటించి తన నటనతో మెప్పించడం గమనార్హం.
అయితే తాజాగా ఈ నటి ఖరీదైన లగ్జరీ కారును( Expensive Luxury Car ) కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు.
సోనియా సింగ్ యూట్యూబర్ గా ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు.విరూపాక్ష విడుదలై దాదాపుగా రెండేళ్లు అయినా ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.
బుల్లితెరపై ఈ సినిమా ఇప్పటికీ మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటోంది.ప్రస్తుతం సోనియా సింగ్( Sonia Singh ) ఒక టీవీ షోకు యాంకర్ గా ఉన్నారు.
మెర్సిడెజ్ బెంజ్ సీ క్లాస్ కారును ఆమె కొనుగోలు చేయడం జరిగింది.ఈ కారు ఖరీదు 60 నుంచి 80 లక్షల రూపాయల రేంజ్ లో ఉంటుందని భోగట్టా.
"""/" /
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
విరూపాక్ష ( Virupaksha )సక్సెస్ తర్వాత సోనియా సింగ్ రెమ్యునరేషన్ భారీ స్థాయిలో పెరిగిందని సమాచారం అందుతోంది.
సోనియా సింగ్ కు ఇన్ స్టాగ్రామ్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
సోనియా సింగ్ కు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పాత్రలు దక్కితే ఆమె కెరీర్ పరంగా మరింత ఎదిగే ఛాన్స్ అయితే ఉంటుంది.
"""/" /
సోనియా సింగ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.
కెరీర్ విషయంలో జాగ్రత్త వహిస్తే ఆమె మరిన్ని సంచలనాలు సృష్టించడం పక్కా అని చెప్పవచ్చు.
సోనియా సింగ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.టీవీ షోలలో చేసిన కామెంట్ల ద్వారా సోనియా సింగ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
ముఖంపై నలుపు పేరుకుపోయిందా.. సులభంగా వదిలించుకోండిలా..!