భర్తతో కలిసి ఖరీదైన కారును కొనుగోలు చేసిన సోనాక్షి సిన్హా.. ఈ కారు ఖరీదెంతో తెలుసా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో సోనాక్షి సిన్హా( Sonakshi Sinha ) ఒకరు.

సోనాక్షి సిన్హా సక్సెస్ రేట్ సైతం చాలా మంది హీరోయిన్లతో పోల్చి చూస్తే ఎక్కువనే సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సోనాక్షి సిన్హా అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.

దబాంగ్ సినిమాతో ఈమె కెరీర్ మలుపు తిరిగిందనే సంగతి తెలిసిందే.ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేసింది.

సౌత్ ఇండియాలో సోనాక్షి సిన్హా లింగా సినిమాలో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఈ సినిమాకు సంబంధించి సోనాక్షి సిన్హా లుక్స్ విషయంలో సైతం తీవ్రస్థాయిలో విమర్శలు వినిపించాయి.

గతేడాది జులైలో సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకోగా జహీర్ ఇక్బాల్( Zaheer Iqbal ) అనే నటుడిని ఆమె పెళ్లి చేసుకోవడం గమనార్హం.

పెళ్లి తర్వాత తరచుగా టూర్స్ కు వెళ్తూ సోనాక్షి సిన్హా వార్తల్లో నిలుస్తున్నారు.

"""/" / అయితే సోనాక్షి సిన్హా తన భర్తతో కలిసి ఖరీదైన కారును కొనుగోలు చేశారు.

ఈ కారు ఖరీదు ఏకంగా కోటీ 30 లక్షల రూపాయలు అని సమాచారం అందుతోంది.

ఈ కారు కొత్త బీఎండబ్ల్యూ కారు( BMW Car ) కావడం గమనార్హం.

సోనాక్షి సిన్హా త్వరలో నికితా రాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.సోనాక్షి సిన్హా రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలోనే ఉందనే సంగతి తెలిసిందే.

"""/" / సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

సోనాక్షి సిన్హా ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సోనాక్షి సిన్హా కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

సోనాక్షి సిన్హా రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సోనాక్షి సిన్హాను అభిమానించే ఫ్యాన్స్ సైతం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.