నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. హీరోయిన్ స్నేహ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును కలిగి ఉన్న హీరోయిన్లలో స్నేహ( Sneha ) ఒకరు.

ఒకప్పుడు హీరోయిన్ గా వరుస విజయాలను సొంతం చేసుకున్న స్నేహ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

అయితే స్నేహ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

పొజెనివ్ నెస్ ఉండాలి కానీ అతిగా ఉండకూడదని ఆమె చెప్పుకొచ్చారు.పొజెసివ్ నెస్( Possesiveness ) ఎక్కువైతే నమ్మకాన్ని బ్యాలెన్స్ చేయలేమని స్నేహ చెప్పుకొచ్చారు.

ఉదాహరణకు బయటకు ఎందుకు వెళ్తున్నావని ఈ సమయంలో వెళ్లి ఏం చేస్తావని ఇలాంటి ప్రశ్నలు తలెత్తకూడదని స్నేహ అన్నారు.

మనల్ని అవతలి వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నలు రావని స్నేహ పేర్కొన్నారు.

ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలని ఆమె కామెంట్లు చేశారు. """/"/ ఒకరు మనల్ని అడిగేముందు నేను ఫలానా చోటుకు వెళ్తున్నానని ఈ సమయంలోపు వచ్చేస్తానని సమాచారం ఇవ్వాలని ఆమె తెలిపారు.

అక్కడికి వెళ్లాక టైమ్ ఉంటే భాగస్వామికి ఫోన్ చేసి నేను చేరుకున్నాన్ను నువ్వు భోజనం చేశావా అని ఆరా తీయాలని స్నేహ చెప్పుకొచ్చారు.

ఇలాంటి చిన్నచిన్నవే ప్రేమ( Love ), నమ్మకాన్ని పెంచుతాయని ఆమె కామెంట్లు చేశారు.

పెళ్లైన కొత్తలో నేను కూడా పొజెసివ్ గా ఉండేదాన్నని అలా అని తనపై నమ్మకం లేదని అర్థం కాదని స్నేహ పేర్కొన్నారు.

"""/"/ గతంలో నా భర్త ఒక అమ్మాయిని ప్రేమించాడని కానీ వారికి బ్రేకప్ అయిందని ఆమె తెలిపారు.

దానివల్ల నాకు ఎలాంటి సమస్య లేదని ఆమె తెలిపారు.ఎందుకంటే ఆ బ్రేకప్( Breakup ) జరిగి ఉండకపోతే ప్రసన్న నాకు భర్తగా దొరికేవాడు కాదని స్నేహ చెప్పుకొచ్చారు.

అప్పుడు నాకు ఇంకో సమస్య వచ్చి పడటంతో ఆ ఏడాది అంతా భారంగా గడిచిందని ఆమె తెలిపారు.

స్నేహ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడా..?