శ్రియ కూతురు అప్పుడే ఇంత పెద్దదైందా… అమ్మ మాట కూడా వినడం లేదుగా?

టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి హీరోయిన్ శ్రియ ( Shirya ) గురించి పరిచయం అవసరం లేదు.

ఒకప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఓవెలుగు వెలిగినటువంటి ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

అయితే ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో బిజీగా ఉన్నారని చెప్పాలి.

ప్రస్తుతం ఈమె వరస సినిమాలలో కీలకపాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఈ విధంగా వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉన్నటువంటి శ్రేయ వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు.

"""/" / ఈమె రహస్యంగా వివాహం చేసుకోవడమే కాకుండా కూతురిని కూడా కన్న విషయం మనకు తెలిసిందే.

ఈమె కూతురికి రాదా( Radha ) అని నామకరణం కూడా చేశారు.అయితే తన కుమార్తెకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకునే శ్రేయ తాజాగా తన కూతురు స్కూల్ కి వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే తన కూతురు ఫస్ట్ డే స్కూల్ ( First Day School ) వెళుతుందంటూ తన భర్త కూతురుతో కలిసి దిగిన ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

"""/" / ఇక స్కూల్ పూర్తి అయినప్పటికీ రాధా మాత్రం స్కూల్ నుంచి ఇంటికి రావడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని, రాధా ప్లే జోన్ లో బాగా ఆడుకోవడానికి చాలా ఆసక్తి చూపుతోంది అంటూ తెలియజేశారు.

ఇంటికి వెళ్దామని ఎంత బ్రతిమలాడినా తాను మాత్రం రానని మొండికేసింది అంటూ తన కూతురు చేసిన పని గురించి శ్రీయ చెబుతూ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఇలా షేర్ చేసిన పోస్ట్ చూసినటువంటి అభిమానులు శ్రీయ కూతురు స్కూల్ కి వెళ్లే అంత పెద్దది అయిందా.

అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఇయర్ ఇండస్ట్రీ హిట్ కొట్టే సినిమాలు ఇవేనా..?