శిల్పశెట్టి బుట్టబొమ్మ అయ్యి వైకుంఠపురం క్రేజ్‌ మరింత పెంచింది

అల వైకుంఠపురంలో చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది.అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే కాకుండా త్రివిక్రమ్‌ కెరీర్‌లో కూడా నిలిచి పోయే సినిమాగా ఆ చిత్రం నిలిచింది.

అద్బుతమైన ఎంటర్‌టైనర్‌ అంటూ సంక్రాంతికి సినిమాను ప్రేక్షకులు తెగ ఎంజాయ్‌ చేశారు.ఇప్పుడు సినిమాకు సంబంధించిన వసూళ్ల లెక్కలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

ఇదే సమయంలో సినిమాలోని పాటలు కూడా సోషల్‌ మీడియాలో ఇంకా కూడా తెగ హడావుడి చేస్తూనే ఉన్నాయి.

ముఖ్యంగా టిక్‌టాక్‌లో అల వైకుంఠపురంలో పాటలు మరియు డైలాగ్స్‌తో కోట్లాది వీడియోలు పోస్ట్‌ అవుతున్నాయి.

బుట్ట బొమ్మ అంటూ ఈ పాటకు సెలబ్రెటీలు కూడా డాన్స్‌ చేస్తున్నారు.ఈ పాట క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందంటే తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శిల్ప శెట్టి కూడా ఈ పాటకు డాన్స్‌ చేసింది.

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంటూ ఉన్న ఈ అమ్మడు బుట్ట బొమ్మ పాటకు డాన్స్‌ వేసింది.

Iframe Width="560" Height="315" Src="https://!--wwwyoutube!--com/embed/fKi359GoH0o" Frameborder="0" Allow="accelerometer; Autoplay; Encrypted-media; Gyroscope; Picture-in-picture" Allowfullscreen/iframe """/"/   అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ పాటకు ఈమె డాన్స్‌ చేయడంతో సినిమా స్థాయి అమాంతం పెరిగింది.

అక్కడ కూడా మన సినిమా గురించి, మన పాటల గురించి ప్రచారం జరుగుతుంది.

దాదాపు మూడు మిలియన్‌ల మంది ఈ వీడియోను చూసినట్లుగా తెలుస్తోంది.ఇంకా పలువురు బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ కూడా అల వైకుంఠపురంలో సినిమా గురించి ఆరా తీస్తున్నారట.

సంక్రాంతికి వస్తున్నాం 12 రోజుల కలెక్షన్ల లెక్కలివే.. వెంకీమామ అదరగొట్టారుగా!