బిడ్డకు పాలు ఇచ్చి అన్ని కిలోలు తగ్గాను.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లలో సనాఖాన్ ఒకరు.

కళ్యాణ్ రామ్ కత్తి( Kalyan Ram Kathi ), గగనం, మిస్టర్ నూకయ్య మరికొన్ని సినిమాలలో నటించడం ద్వారా సనాఖాన్ పాపులర్ అయ్యారు.

సోషల్ మీడియాలో సైతం ఈ బ్యూటీకి క్రేజ్ పెరుగుతోంది.పలు యాడ్స్ లో కూడా నటించి తన నటనతో సనాఖాన్( Sana Khan ) ఎంతగానో ఆకట్టుకున్నారు.

"""/"/ కొన్నిరోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సనాఖాన్ బిడ్డకు పాలు ఇవ్వడం( Breastfeeding ) గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఇతర ఆహారాలతో పోల్చి చూస్తే తల్లిపాలు( Mother Milk ) ఎంతో ఆరోగ్యకరమైనవని సనాఖాన్ పేర్కొన్నారు.

తల్లిపాలు తాగితే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.శిశువుకు పాలు ఇవ్వడం ఎంతో ముఖ్యమని ఆమె అన్నారు.

శిశువు పాలు తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ ( Immunity Power )పెరుగుతుందని సనాఖాన్ వెల్లడించడం గమనార్హం.

శిశువుకు నెల రోజులు పాలు ఇవ్వడం ద్వారా నేను ఏకంగా 15 కిలోల బరువు తగ్గానని సనాఖాన్ వెల్లడించారు.

తల్లి పాలు ఇవ్వడం వల్ల బరువు తగ్గవచ్చని శాస్త్రీయంగా ప్రూవ్ అయిందని సనాఖాన్ పేర్కొన్నారు.

సనాఖాన్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. """/"/ అయితే సనాఖాన్ ప్రతి విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదని ఏ విషయాన్ని చెప్పాలో ఏ విషయాన్ని చెప్పకూడదో అవగాహన కలిగి ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సనాఖాన్ రీఎంట్రీ( Heroine Sana Khan Re Entry ) ఇచ్చి మరింత సక్సెస్ కావాలని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

సనాఖాన్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా కలిసిరాకపోయినా బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఆమెకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆఫర్లు వస్తున్నాయి.

ఈ హీరోయిన్ పారితోషికం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.సినీ కెరీర్ విషయంలో సనాఖాన్ నిర్ణయాలు ఎలా ఉంటాయో తెలియాల్సి ఉంది.

అంతరిక్షంలో ఒకే రోజు 16 సూర్యోదయాలు.. సునీతా విలియమ్స్‌కి అద్భుతమైన అనుభవం!