Sanyukta Menon : లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా ?
TeluguStop.com
సంయుక్త మీనన్( Sanyukta Menon ).ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో లక్కీ చార్మ్ గా కొనసాగుతుంది.
నాలుగు సినిమాలు వరసగా విజయవంతం కావడం తో ఆమె ప్రెసెంట్ చాల మంది దర్శకులకు ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.
సినిమాలో హీరో ఎవరు ఉన్నారు అనే విషయం కన్నా హీరోయిన్ ఎవరు అని అడిగే స్థాయికి అదృష్టం పెద్ద పాత్ర వహిస్తుంది.
అందుకే సంయుక్త సినిమాలో ఉంటె అది ఖచ్చితంగా హిట్ అవుతుంది అని టాలీవుడ్( Tollywood ) నమ్ముతుంది.
మరి ఇన్ని వరస అవకాశాలను దక్కించుకుంటున్న సంయుక్త మీనన్ ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంది, ఎంత ఆస్తులను కూడబెట్టింది, ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి, వాడుతున్న కార్లు, తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
"""/" /
ఇక సంయుక్త మలయాళ ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయి.ఆమె కేరళ లోని పాలక్కాడ్ లో( Palakkad, Kerala ) జన్మించింది.
27 ఏళ్ళ సంయుక్త పాప్ కార్న్ అనే మళయాళ సినిమా ద్వారానే తన డెబ్యూ చేసింది.
ఇక తెలుగు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది.
ఈ సినిమా లో చేసింది చిన్న పాత్రే అయినా కూడా ఆ తర్వాత బింబి సారా సినిమాలో నటించడం తో మంచి గుర్తింపు దక్కించుకుంది.
ఈ సినిమా తర్వాత ఆమె ధనుష్ హీరో గా నటించిన సార్( Sir ) సినిమా ద్వారా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
ఈ సినిమా తర్వాత ఆమె రెమ్యునరేషన్ కూడా బాగానే పెంచింది.ఒక్కో సినిమా కోసం 70 లక్షల నుంచి కోటి రూపాయల వరకు తీసుకుంటుంది.
"""/" /
ఇక ఇప్పుడు ఆమె నటించిన విరూపాక్ష సినిమా( Virupaksha Movie ) మంచి విజయం సాధించడం తో ఆమె రెమ్యునరేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇక ఆమె సినిమాల ద్వారా ఈ మధ్య బాగానే వెనకేసింది అని తెలుస్తుంది.
ఆమె కుటుంబం నుంచి కొచ్చి లో ఒక బంగ్లా అలాగే ఆమె పుట్టిన పాలక్కాడ్ లో కూడా ఒక ఇల్లు ఉన్నాయ్.
ఈ మధ్య హైదరాబాద్ లో కూడా ఒక అపార్ట్మెంట్ కొనేసింది.ఈమె మొత్తం ఆస్థి ఒక పది కోట్ల వరకు ఉంటుంది.
ఎలాంటి బ్యగోరును లేకుండా ఇండస్ట్రీ కి వచ్చింది బాగానే సెటిల్ అయ్యింది ఈ అమ్మడు.
ఇక ఆమె కార్స్ కలెక్షన్ విషయానికి వస్తే ఆమె గ్యారేజ్ లో ఒక మెర్సిడెజ్ బెంజ్ కారు ఉండగా దీని ఖరీదు 80 లక్షల వరకు ఉంటుంది.
సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పై స్పందించిన పవన్!