సమంత ఒక ఫైటర్ అని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు !

రెండు మూడు రోజులుగా ఎక్కడ చూసిన సమంత కు వచ్చిన కొత్త జబ్బు గురించే వార్తలు కనిపిస్తున్నాయి.

సమంతకు ఇలా వార్తల్లో నిలవడం కొత్తేమి కాదు వింత కూడా ఏమి కాదు.

సోషల్ మీడియా సమంత అనారోగ్యం పై అనేక రకాల రూమర్స్ సృష్టిస్తూ ఉంటారు.

అందుకే ఎలాంటి అపోహలకు తావు ఇవ్వకూడదని ఆమె తన అనారోగ్య విషయాన్నీ ఆమె బహిర్గతం చేసి మీడియా కు కంటెంట్ ఇచ్చింది.

ఇలా ఆమె తన అనారోగ్యం గురించి బయట పెట్టడం ఆమెలోని ఆత్మ విశ్వాసాన్ని బయట పెడుతుంది.

తాను ఎంతో కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నాను ఇప్పుడు దీని వంతు వచ్చింది.ఇది కూడా తనను ఏమి చేయలేదు అనే ఆమె మాటల్లో ఎంతో కాన్ఫిడెన్స్ తొణికిసలాడుతుంది.

అయితే సమంతకు ఇది ఏమి తొలి వ్యాధి కాదు ఆమెకు 2013 నుంచి డయాబెటిస్ కూడా ఉంది.

ఈ వ్యాధి అంతం కాదు దీనికి నివారణ లేదు.కేవలం నియంత్రణ మాత్రమే.

తన మనసు, శరీరం రెండు తన కంట్రోల్ లో పెట్టుకొని ఆమె ఆ వ్యాధి ని కంట్రోల్ లో పెట్టుకుంది.

ఇక ఇప్పుడు మయోసైటిస్.ఇది కూడా జీవితాంతం తనతో కలిసి ప్రయాణం చేస్తుంది.

దీనికి నియంత్రణ తప్ప నివారణ లేదు.అయితే సమంత కు మాత్రం బలమైన ఆయుధం ఆమె ఆత్మ విశ్వసమే.

ఆమెతో స్నేహితులు, కుటుంబం అండగా ఉండచ్చు.కానీ ఈ సమయంలో ఆమెకు అక్కినేని కుటుంబం తోడు కూడా ఉంటె చాలా బాగుండేది.

ఆమె ఇంకా సమర్థంగా ఈ వ్యాధి నుంచి బయట పడేది. """/"/ ఇక ఈ వ్యాధి అంత అనుకున్నట్టు ఇప్పుడు కొత్తగా బయటపడలేదు.

చాల రోజుల క్రితమే తనకు ఉన్న ఈ సమస్య గురించి సమంతకు తెలుసు.

ఎవరికీ వారు ఏది పడితే అది రాయడం ఎందుకు అని సమంత ఒక క్లారిటీ ఇచ్చింది అంతే.

మనిషికి సగం చికిత్స వారి సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ కరేజ్ నుంచే వస్తాయి.

సమంత ఖచ్చితంగా ఎంతో దృఢమైన వ్యక్తి మరియు వ్యక్తిత్వం కూడా ఉంది.ఆమె దేన్నైనా ఎదురించగలదు.

ఈ విషయాన్నీ తనలోనే దాచుకోవాలనుకోవడం లేదు.అన్ని సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేస్తుంది.

దీన్ని బట్టి మనం కూడా అర్ధం చేసుకోవచ్చు.ఆమె ఎంత దృఢమైన సంకల్పం కలిగిన వ్యక్తి అని.

అల్ ద బెస్ట్ సమంత.విష్ యు ఏ స్పీడ్ రికవరీ.