అయ్యో.. ఆ కొత్త హీరోయిన్ కు ఎన్ని కష్టాలు.. సురేందర్ రెడ్డి చేతిలో ఇరుక్కుపోయిందా?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొత్త హీరో లేదా హీరోయిన్, అలాగే డైరెక్టర్లను పరిచయం చేసినప్పుడు, వాళ్లు ప్రాసెసింగ్ లో ఉన్నారు పాపులర్ అవుతారు అనుకుంటే వారిని నిర్మాణ సంస్థలు లేదా దర్శకులు లాక్ చేస్తూ ఉంటారు.

అలా చేసిన వారి తర్వాత సినిమాను వారితోనే చేయాలి లేదంటే పెనాల్టీ చెల్లించాలి అంటూ రకరకాల కండిషన్లు పెట్టి ముందే అగ్రిమెంట్ రాయించుకుంటూ ఉంటారు.

అయితే ఒక్కొక్కసారి అది వారి కెరీర్ కు ప్లస్ పాయింట్ అవుతూ ఉంటుంది.

కొన్ని కొన్ని సార్లు మైనస్ కూడా అవుతూ ఉంటుంది.అయితే కొందరు పెనాల్టీ చెల్లించి భయపడుతూ ఉంటారు.

పెనాల్టీ తరువాత అంటే ఒక అగ్రిమెంట్ ప్రకారం సినిమాలో వచ్చే రెమ్యూనరేషన్ లో సగం అగ్రిమెంట్ చేసుకునే వారికి ఇవ్వడం.

తాజాగా ఒక దర్శకుడి దగ్గర హీరోయిన్ కూడా ఈ విధంగానే ఇరుక్కుపోయింది.టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఏజెంట్ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.

సాక్షికి తెలుగులో ఇదే మొదటి సినిమా.కాగా ఇప్పటికే ఆమెకూడా సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

"""/" / దీంతో ఆమెను సినిమాలలోకి హీరోయిన్ గా తీసుకోవడానికి పలువురు దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే హీరోయిన్ సాక్షిని దర్శకుడు సురేందర్ రెడ్డి లాక్ చేసినట్టు తెలుస్తోంది.

అఖిల్ నటిస్తున్న సినిమా విడుదల అయ్యే వరకో, లేదా విడుదల అయిన తరువాత, ఆ నెక్స్ట్ సినిమాను కూడా ఆయనకే చేయాలనే అగ్రిమెంట్ ఉందని వినిపిస్తోంది.

కాగా సాక్షి తొలి సినిమాకు ఆమె ముఫై లక్షల మేరకు పారితోషికం తీసుకుంది.

కాగా ఆ తరువాత సినిమాకు కోటి రూపాయలు ఇవ్వడానికి కూడా నిర్మాతలు రెడీగా వున్నప్పటికీ సాక్షి ఈ విధంగా లాక్ అయ్యి ఉండటపట్ల ఆమె నిరాశ వ్యక్తం చేస్తోందట.

కాగా ఈ విషయం పై పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

కేవలం స్క్రీన్ ప్లే తో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలు ఇవే !