భయంకరమైన పులుల మధ్య సఫారీ రైడ్ చేస్తున్న సదా.. వైరల్ అవుతున్న ఫోటోలు?
TeluguStop.com
జయం సినిమాతో తెలుగు తెలుగు పరిచయమైన నటి సదా మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకొని అనంతరం తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఈ విధంగా అగ్ర హీరోలు అందరి సరసన నటించిన సదా ప్రస్తుతం హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరైన సదా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె అతి భయంకరమైన పులులు మద్య సఫారీ రైడ్ చేస్తూ ఎంతో చిల్ అవుతున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈ రైడ్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈమె మధ్యప్రదేశ్లోని పెంచ్ నేషనల్ పార్కులో సఫారి రైడ్‌కు వెళ్లింది.అదికూడా భయంకరమైన పెద్ద పులులు తిరిగే అటవీ ప్రాంతంలో కలియ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పులులు ఇతర అడవి జంతువుల ఫోటోలను తన కెమెరాలో బంధించింది.
"""/"/
ప్రస్తుతం ఈ రైడ్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలాగే ఈ రైడ్ కు సంబంధించిన విషయాలను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే గత కొంతకాలం నుంచి వెండితెరకు దూరమైన సదా బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ సందడి చేశారు.
అయితే ప్రస్తుతం హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ 5 లో ప్రసారమవుతుంది.
విదేశాల నుంచి ఆదాయమే లక్ష్యం .. కొత్త డిపార్ట్‌మెంట్‌ను సృష్టించిన డొనాల్డ్ ట్రంప్