మగాడిలా ఉన్నావ్ అంటూ స్టార్ హీరోయిన్ పై ట్రోల్… నటి రియాక్షన్ ఇదే?

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి నటిగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి రష్మిక మందన్న ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అన్ని భాషలలో సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమా అవకాశాలతో బిజీగా గడుపుతున్న రష్మిక ఈ మధ్యకాలంలో పలు వివాదాలలో చిక్కుకుంటున్నారు.

అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ఈమెను ట్రోల్ చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.

అయితే ఎప్పటికప్పుడు ట్రోల్స్ పై స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ ఉంటుంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రష్మిక తన గురించి వస్తున్న ట్రోలర్స్ పై మరోసారి నోరు విప్పారు.

ముఖ్యంగా కొందరు తన స్త్రీ తత్వాన్ని కూడా అవమానపరుస్తూ తనని ట్రోల్ చేస్తున్నారని వెల్లడించారు.

కొందరైతే తనని ఏకంగా మగాడిలా ఉన్నావ్ అంటూ కూడా కామెంట్లు చేశారని రష్మిక వెల్లడించారు.

"""/" / అయితే కొన్నిసార్లు తనకు కూడా అనుమానం వచ్చి తనని తాను ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నానని,కొన్నిసార్లు సినిమాలు నిలిపివేయాల అని ఆలోచన కూడా తనకు వస్తుంది అంటూ తన గురించి వచ్చిన ట్రోల్స్ పై ఈమె స్పందించి తన ఆవేదనను తెలియజేశారు.

ఇలా ట్రోల్లర్స్ దాటిని ఎదుర్కోలేక కొన్నిసార్లు అలాంటి ఆలోచన వస్తుందని రష్మిక తెలియజేశారు.

"""/" / ప్రస్తుతం ఈమె సినిమాల విషయానికి వస్తే తమిళంలో ఈమె నటించిన వారసుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అదేవిధంగా హిందీలో మిషన్ మజ్ను సినిమా కూడా జనవరి 20 వ తేదీ విడుదలైంది.

ప్రస్తుతం రష్మిక పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారు.ఇప్పటికే ఈ షూటింగ్ జరుగుతుండగా ఈమె వచ్చే నెల నుంచి షూటింగులో పాల్గొనబోతున్నారని వెల్లడించారు.