బన్నీ మాటలతో ఇంటికెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నా.. రష్మిక కామెంట్స్ వైరల్!

బన్నీ మాటలతో ఇంటికెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నా రష్మిక కామెంట్స్ వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప థియేటర్లలో రిలీజ్ కావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.

బన్నీ మాటలతో ఇంటికెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నా రష్మిక కామెంట్స్ వైరల్!

రేపు ఉదయం ఇదే సమయానికి పుష్ప సినిమా రిజల్ట్ తేలిపోనుంది.రష్మిక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ శ్రీవల్లి పాత్ర మేకప్ కోసం రెండున్నర గంటల సమయం పట్టేదని ఆ మేకప్ తీయడానికి కూడా అంతే సమయం పట్టేదని రష్మిక చెప్పుకొచ్చారు.

బన్నీ మాటలతో ఇంటికెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నా రష్మిక కామెంట్స్ వైరల్!

బన్నీ ఆయిల్ వాడమని సలహా ఇవ్వడంతో ఆయిల్ వాడి అరగంటలో మేకప్ ను రిమూవ్ చేసుకునేదానినని రష్మిక కామెంట్లు చేశారు.

శ్రీవల్లి పాత్ర కొరకు రెండు మూడు లుక్ టెస్ట్ లు చేశారని ఆ తర్వాత ప్రస్తుతం చూస్తున్న లుక్ ను ఫైనల్ చేశారని రష్మిక అన్నారు.

పుష్ప మూవీ షూట్ జరిగిన సమయంలో బన్నీ తన జిమ్ మేట్ అని బన్నీ స్పూర్తితో తాను కూడా వర్కౌట్లు చేసేదానినని రష్మిక చెప్పుకొచ్చారు.

సుకుమార్ మ్యాథ్స్ టీచర్  అయితే ఆయన క్లాస్ లో నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అని రష్మిక వెల్లడించారు.

అల్లు అర్జున్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అని రష్మిక కామెంట్లు చేశారు. """/" / ఇప్పుడిప్పుడే వయసు పెరుగుతూ ఉండటంతో మాటలు తగ్గిస్తున్నానని రష్మిక చెప్పుకొచ్చారు.

మొదట శ్రీవల్లి పాత్ర విషయంలో భయపడ్డానని అయితే బన్నీ మాటల వల్ల తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని రష్మిక పేర్కొన్నారు.

బన్నీ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన గురించి ప్రశంసలు కురిపించారని ఆయన మాటలు విని ఇంటికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నానని రష్మిక చెప్పుకొచ్చారు.

ఇప్పుడు కూడా కన్నీళ్లు వస్తున్నాయని అయితే ఏడవనని సుమతో ఇంటర్వ్యూలో రష్మిక తెలిపారు.

"""/" / అల్లు అర్జున్ మాట్లాడుతూ నటీనటులు ఎంతమంది ఉన్నా సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అదిరిపోతుందని చెప్పుకొచ్చారు.

నా సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ పని చేస్తే ఖచ్చితంగా రెండు బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇస్తాడని పుష్పలో మాత్రం అన్ని పాటలు చక్కగా కుదిరాయని బన్నీ చెప్పుకొచ్చారు.

పాటలు సక్సెస్ అయ్యాయంటే చంద్రబోస్ కు కూడా క్రెడిట్ ఇవ్వాలని బన్నీ పేర్కొన్నారు.