రష్మికకు ఆమె చెల్లికి ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా.. రష్మిక చెప్పిన షాకింగ్ విషయాలివే!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక( Rashmika ) కెరీర్ పరంగా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఉన్నారు.

గతేడాది పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాతో ఏడాది ఛావా( Chhaava ) సినిమాతో రష్మిక ఖాతాలో ఇండస్ట్రీ హిట్లు చేరాయి.

రష్మిక నటిస్తే వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్లు గ్యారెంటీ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే రష్మిక పారితోషికం కూడా ఒకంత భారీ స్థాయిలోనే ఉంది.

తాజాగా రష్మిక ఒక సందర్భంలో తన కుటుంబం గురించి వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం రష్మిక సల్మాన్ ఖాన్ కు జోడిగా సికిందర్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాతో ఆమె ఖాతాలో భారీ విజయం దక్కుతుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

రష్మిక స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

"""/" / తల్లిదండ్రుల పెంపకం వల్లే తాను ఇలా సింపుల్ గా ఉంటున్నానని ఆమె పేర్కొన్నారు.

ఇది నా జీవితం అని నా జీవితంలో జోక్యం చేసుకోమని మమ్మల్ని అడగొద్దని తల్లిదండ్రులు చెప్పారని రష్మిక పేర్కొన్నారు.

నాకు ఒక చెల్లెలు( Rashmika Sister ) ఉందని నా చెల్లి వయసు 10 సంవత్సరాలు మాత్రమేనని రష్మిక అన్నారు.

నాకు నా చెల్లికి మధ్య ఏజ్ గ్యాప్ ఏకంగా 16 సంవత్సరాలు అని రష్మిక చెప్పుకొచ్చారు.

"""/" / నేను నా చెల్లి విషయంలో ఎప్పుడూ ఆలోచించేది ఒక్కటేనని ప్రస్తుతం నాకున్న పరిస్థితుల వల్ల నా చెల్లి ఏదైనా పొందుతుందని కానీ నేను పెరిగిన పెంపకం లాంటిదే నా చెల్లికి కూడా దక్కాలని నేను కోరుకుంటానని రష్మిక అన్నారు.

బాల్యం నుంచి ప్రతి వ్యక్తి స్వతంత్రంగా ఉండాలని నేను కోరుకుంటానని ఆమె పేర్కొన్నారు.

నా చెల్లికి భద్రత ఇవ్వడంతో పాటు నేను ఇవ్వాల్సిన సౌకర్యాలు సైతం ఎక్కువగానే ఉన్నాయని రష్మిక చెప్పుకొచ్చారు.