Heroine Raja Sulochana : ఆ హీరోయిన్ వందల సినిమాల్లో నటించినా.. ఇద్దరు భర్తలతో అన్ని ఇబ్బందులు పడిందా..?
TeluguStop.com
ఏ చిత్రం సినిమాలో అయినా సరే ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదిరిచిన వివాహాలు అయినా సరే విడాకులు తీసుకోవడం సర్వసాధారణం.
అయితే ప్రస్తుతం ఉన్న జనరేషన్ హీరో హీరోయిన్లు మాత్రమే కాదు.అలనాటి హీరో హీరోయిన్ల విషయంలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం ఉన్నాయి.
అలనాటి రోజుల్లో హీరోయిన్ గా రాజ సులోచన( Heroine Raja Sulochana )కు ఓ ప్రత్యేక స్థానం ఉంది.
ఈమె కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా బోట్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్, నృత్య ప్రదర్శన, నాటక రంగాలలో కూడా మంచి పేరును సంపాదించుకున్నారు.
ఈవిడ 1934 ఆగస్టు 15 విజయవాడలో జన్మించారు.ఈవిడ అసలు పేరు రాజీవలోచన.
అయితే స్కూల్లో జరిగిన తప్పిదం వల్ల రాజ సులోచనగా ఆమె పేరు మారింది.
"""/"/
ఆమెకు నృత్యంలో ఉన్న సాధనకు ఆవిడ నృత్యం( Dance ) నేర్పించే స్థాయికి చేరుకుంది.
అలా వారి ఇంటి దగ్గర ఉన్న యువతకి నృత్యం నేర్పించేందుకు వాళ్ళ ఇంటి దగ్గరికి తరచూ వెళ్ళేది.
అక్కడ కొన్ని దినాలపాటు మిలిటరీలో పనిచేసి ఆ సమయంలో ఉన్న ప్రగతి స్టూడియోలో స్టోర్ కీపర్ గా పనిచేసే పరమశివం అనే వ్యక్తి ఆవిడకు పరిచయం అయ్యాడు.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వారు పెద్దలను ఒప్పించి 1951 సెప్టెంబర్ 11న మద్రాస్ నగరంలోని సెయింట్ మేరీస్ హాలులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి( Former CM Karunanidhi ) సమక్షంలో వారి వివాహం జరిగింది.
ఇలా వివాహం జరిగిన మొదటి సంవత్సరమే వారికి ఒక అబ్బాయి పుట్టాడు.అయితే పెళ్లయ్యాక ఆవిడకు సినిమాలలో అవకాశాలు రావడంతో నటించడానికి వెళ్ళింది.
మొదట కెరియర్లో అనేక వేషాలు వేసిన పెద్దగా పేరు రాలేదు.ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన ' సొంత ఊరు '( Sontha Ooru ) అనే సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం లభించింది.
దాంతో ఆవిడకు ఆ సినిమా తర్వాత అనేక సినిమాలలో హీరోయిన్గా ఛాన్స్ రావడంతో ఆమె సినిమాలలో బిజీగా మారిపోయింది.
"""/"/
ఒకవైపు సినీ పరిశ్రమలో ఆమె బిజీగా ఉంటూనే.మరోవైపు కుటుంబ సమస్యలతో సతమతమయ్యారు.
వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.భర్త పరమశివంతో ఆమె తరచూ గొడవలు పడడంతో, అది భరించలేక ఆయనకు విడాకులు ఇచ్చేసింది.
అదే సమయంలో ఆమె కెరియర్ లో కూడా అనేక ఆటుపోట్లు ఎదురయ్యాయి.అలాంటి సమయంలో ఆవిడకు తోడుగా ఓ మంచి వ్యక్తి ఉండాలని భావించింది.
అదే సమయంలో డైరెక్టర్ సి.ఎస్.
రావు( Director CS Rao ) ఆమెను ఆకర్షించాడు.ఆమె బాధలను ఆయనకు చెబుతూ సేద తీరేది.
ఆయన దర్శకత్వం వహించిన సినిమాలలో ఈవిడ హీరోయిన్గా నటించింది.అయితే వీరిద్దరూ చనువు చూసి సినీ పరిశ్రమలలో అనేక పుకార్లు రావడంతో వారిద్దరు పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నారు.
వీరిద్దరూ 1963 లో పెళ్లి చేసుకోగా.1966 జులై 27న వీరిద్దరికి కవల పిల్లలు పుట్టారు.
నిజానికి ఆ సమయంలో కవల పిల్లలు పుట్టడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇక రాజసులోచన కన్నడ, తెలుగు, తమిళ భాషలకు సంబంధించి ఏకంగా 300కు పైగా చిత్రాలలో నటించింది.
రావు తో పెళ్లి జరిగిన కొత్తలో ఎంతో ఆనందంగా ఉన్నవారు తర్వాత వారి మధ్య సఖ్యత లోపించడంతో అనేక అభిప్రాయం బేదాలు పెరిగాయి.
దీంతో వీరు కూడా విడిపోయారు.రాజ సులోచన చివరికి అనారోగ్య సమస్యల వల్ల మార్చి 5 , 2013న తుది శ్వాస విడిచారు.
బన్నీని కలవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదా.. అక్కడ జరిగింది ఇదేనా?