జంధ్యాల సినిమాలో నటించనని తెగేసి చెప్పిన అమ్మాయి ఎవరో తెలుసా?

జంధ్యాల.తెలుగు సినిమా గురించి ఏమాత్రం పరిచయం ఉన్న వ్యక్తులకైనా ఆయన గురించి తెలిసే ఉంటుంది.

రచయితగా, దర్శకుడిగా ఆయనకు ఎంత గొప్ప పేరుందో.మంచి మనిషిగా అంతకంటే గొప్ప పేరుంది.

ఆయన సమస్యల్లో పడ్డా.ఇతరులను సమస్యల్లో పడకుండా చూసేవాడు.

రచయితగా తను మంచి ఫామ్ లో ఉన్నప్పుడే ఆయన ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు.

రైటర్ నుంచి దర్శకుడిగా మారాలని భావించాడు.అనుకున్నట్లుగానే 1981లో వచ్చిన ముద్దమందారం సినిమాతో దర్శకుడిగా మారాడు.

అనంతరం 1982లో నాలుగు స్తంభాలాట సినిమా తీసి తన సత్తా చాటుకున్నాడు.ఈ సినిమా తర్వాత తను తిరుగులేని దర్శకుడిగా మారిపోయాడు.

దర్శకుడిగా, రచయితగా కొనసాగాడు.సినిమా రంగంలోకి రావాలని చాలా మంది భావిస్తుంటారు.

ఒక్క అవకాశం ఇవ్వడం తమ టాలెంట్ నిరూపించుకుంటాం అంటూ ఎంతో మంది నటీనటులు సినిమా కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు.

తెరమీద తమ బొమ్మ కనపడితే చాలు అనుకుంటారు.కానీ ముద్దమందారం సినిమా హీరోయిన్ విషయంలో జంధ్యాలకు ఎదురైన అనుభవం చాలా విచిత్రంగా ఉంటుంది.

తన తొలి సినిమాలో హీరోయిన్ ఎంపిక కోసం ఆయన చాలా ఊర్లకు వెళ్లాడు.

చాలా మంది అమ్మాయిలను చూశాడు.కానీ నచ్చలేదు.

ఒక ఊరిలో ఓ అమ్మాయి కనిపించింది.తనను చూడగానే ఈ సినిమాకు హీరోయిన్ గా ఓకే అనుకున్నాడు.

వెంటనే ఆ ఊరి పెద్దల సాయంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులను కలిశాడు. """/"/ అయితే అమ్మాయి తల్లిదండ్రులకు ఆమెను సినిమాల్లోని పంపేందుకు ఇష్టపడలేదు.

కానీ పెద్దమనుషులతో చెప్పి మంచి భవిష్యత్తు ఉంటుందని ఒప్పించాడు జంధ్యాల.కానీ అంతలోనే ఆ అమ్మాయి వచ్చింది.

సార్.నన్ను క్షమించండి.

నేను మీ సినిమాలో చేయను.అసలు సినిమాల్లోకే రాను అని చెప్పింది.

మీ అమ్మానాన్నలు కూడా ఒప్పుకున్నారు.నీకేం కాదు.

మంచి పేరు వస్తుంది అని జంధ్యాల చెప్పాడు.అయినా ఆ అమ్మాయి ఒప్పుకోలేదు.

పెద్దమనుసులు చెప్పినా నో చెప్పింది.మా అమ్మానాన్న తెచ్చిన సంబంధం చేసుకుని హాయిగా సంసారం చేసుకుందాం అనుకుంటున్నాడు.

అది మీకు ఇష్టం లేదా అంది.జంధ్యాల తన ధైర్యాన్ని మెచ్చుకుని అక్కడి నుంచి వచ్చేశాడు.

చివరకు ముద్దమందారం హీరోయిన్ గా పూర్ణిమను ఎంపిక చేశాడు.ఈ విషయాన్ని స్వయంగా జంధ్యాల వెల్లడించారు.

ఎండ‌ల‌ దెబ్బ‌కు చ‌ర్మం పొడిబారిందా.. పుచ్చ‌కాయ‌తో రిపేర్ చేసుకోండిలా!