Heroine Pranitha: కన్ఫ్యూషన్ లో ప్రణీత.. ఫాలోవర్స్ తో డౌట్ క్లియర్ అయ్యినట్లేనా?
TeluguStop.com
ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం తమకున్న అనుమానాలన్నీ సోషల్ మీడియా ద్వారానే క్లియర్ చేసుకుంటున్నారు.
తమ డౌట్లను ఫాలోవర్స్ ను అడిగి తెలుసుకుంటున్నారు.అయితే ఇటువంటి విషయాలలో హీరోయిన్ ప్రణిత( Heroine Pranitha ) ముందుంటుంది.
తనకి ఏదైనా అనుమానం వస్తే చాలు వెంటనే తన ఫాలోవర్స్ ని అడిగేస్తూ ఉంటుంది.
అయితే తాజాగా తను మరింత కన్ఫ్యూజన్లో ఉండటంతో ఈసారి కూడా తన ఫాలోవర్స్ పై ఆధారపడింది.
ఇంతకు తనకున్న కన్ఫ్యూజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి.
తొలి చూపులోనే తెలుగు వారిని ఫిదా చేసింది.ఏం పిల్లో.
ఏం పిల్లడో అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది.
ఇక అత్తారింటికి దారేది( Attarintiki Daredi ) సినిమాలో మంచి పేరు తెచ్చుకుంది.
ఇక బ్రహ్మోత్సవం, రభస వంటి పలు సినిమాలలో నటించింది.కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా మెప్పించలేకపోయింది.
టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది.ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించి తనేంటో నిరూపించుకుంది.
కానీ ఏ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలువలేకపోయింది ఈ ముద్దుగుమ్మ.ఇక ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కంటే వ్యక్తిగతంగా మంచి పేరు సంపాదించుకుంది.
ఒక హోదాలో ఉన్న సమయంలోనే నితిన్ రాజ్( Nitin Raj ) అనే ఓ బడా బిజినెస్ మాన్ ను వివాహం చేసుకుంది.
ఇక పెళ్లి జీవితంలోకి అడుగు పెట్టాక సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చింది.పైగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
సమాజ సేవలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది. """/" /
ఇక సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.
పాప పుట్టిన తర్వాత కూడా తన ఫిజిక్ లో ఎటువంటి మార్పులు లేవని చెప్పవచ్చు.
ఇంకా తన అందాన్ని రెట్టింపు చేసుకుంటూ సోషల్ మీడియాలో( Social Media ) వాటిని బాగా పంచుకుంటూ బాగా సందడి చేస్తుంది.
ప్రణీత ఎంత హీరోయిన్ అయినప్పటికీ కూడా పెళ్లయ్యాక మాత్రం సాంప్రదాయాలు అసలు మర్చిపోలేదు.
భర్త విషయంలో తను చేసే పూజలు ప్రతి ఒక్కరిని ఫిదా చేస్తాయి. """/" /
అయితే ప్రణీతకు ఏమైనా డౌట్స్ ఉన్న వెంటనే గూగుల్ తల్లి అడిగేస్తూ ఉంటుంది.
ముఖ్యంగా తన కూతురికి సంబంధించిన విషయాలు వెంటనే అడుగుతుంది.అయితే తాజాగా తనకు దృష్టి, నజర్( Drishti ) అనే వాటిపై అనుమానం ఉండటంతో వెంటనే తన డౌట్ ను క్లియర్ చేసుకోవడానికి తన ఫాలోవర్స్ ను అడిగింది.
మీరు దృష్టి, నజర్ వంటివి నమ్ముతారా అని ప్రశ్నించింది. """/" /
అయితే దానికి అందరూ ఎటువంటి సమాధానం చెప్పారో తెలియదు కానీ.
తనకు మాత్రం ఇటువంటివి నమ్మాలో లేదో తెలియదని.కానీ తన పాప ఫోటో పంచుకున్న ప్రతిసారి పాప అనారోగ్యానికి గురవుతుందని, అంతేకాకుండా బాగా సిక్ అవుతుందని.
ఇటువంటివి ఉంటాయంటే చాలా ఫన్నీగా అనిపిస్తుంది అంటూ మరికొన్ని విషయాలు పంచుకోగా తను మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసా..?