ఆ ‘కెమెరామెన్’తో సంబంధం లేదంటున్న హీరోయిన్!

సినీ ఇండస్ట్రీలో నటించే వారిపై వచ్చే పుకార్ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఎక్కడ దొరుకుతుందా.ఎప్పుడు ఆ నటుడిపై లేదా నటిపై పుకార్లు షికార్లు కొట్టేలా చూద్దామా.

అంటూ చాలా మంది కాచుకూర్చుంటారు.సరదాగా అలా ఎక్కడికన్న వెళ్లినా లేదా తన ఫ్రెండ్ తో కలిసినా ఇక వారిద్దరి మధ్యన ఏదో ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తుంటాయి.

జెండర్ తేడాగా ఉంటే ఇక రిలేషన్ షిప్ ఉండటమేనా.అది ఎంత వరకు వాస్తవం అనే దాని గురించి ఎవరికీ అవసరం లేదు.

కాని హీరోయిన్లపై వచ్చే ఆ నెగిటీవ్ షేడ్ ను మాత్రమే చూస్తారు.ఒక అబ్బాయితో కనిపిస్తే చాలు ఆ నటిలపై గాసిప్స్ మొదలైనట్టే.

ఇలాంటి గాసిప్స్ వచ్చినప్పుడు ఆ హీరోయిన్లు ఎంత బాధపడతారనేది ఎవరికీ అవసరం లేదు.

కాని అది నిజం కాదంటూ ఎంత మొత్తుకున్నా నమ్మేవారుండరేమో.అలాంటి ఒక గాసిపే నటి పూర్ణ పై కూడా తాజాగా వచ్చింది.

ఒక కెమరామెన్ తో పూర్ణ రిలేషన్ షిప్ లో ఉందంటూ వారిరువు తొందరలో పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

అలాగే పూర్ణకు సంబందించిన సినిమాలు, వాటి రెమ్యునరేషన్ కు సంబంధించినవి కూడా భరణి అనే కెమెరామెనే చూసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై పూర్ణ స్పందించింది.తాను భరణిని రెండు మూడు సార్లు మాత్రమే కలిసానని.

నేను తనతో ఎప్పుడు కలిసి పనిచేయలేదని పూర్ణ స్పష్టం చేసింది.ఒక సినిమా గురించి చర్చలోనే నేను అతనిని కలిసానని.

అంతకు మించి ఎప్పుడూ అతనిని కలిసిందే లేదని సూర్ణ తెలిపింది.ప్రేమ, పెళ్లి ఇలాంటి పుకార్లు చేయడం దారుణమని ఆమె మండిపడ్డారు.

అందులోనో భరణిని నేను ప్రేమించాననేది పచ్చి అబద్దమని ఆమె స్పష్టం చేసింది.

కాంగ్రెస్ రైతు ప్రభుత్వం.. మంత్రి తుమ్మల