Pooja Hegde Salman Khan : ఆ వార్తలపై అసహనం వ్యక్తం చేసిన పూజా హెగ్డే.. అలా చేయాలనుకుంటే కారు కొనివ్వండి అంటూ?

pooja hegde salman khan : ఆ వార్తలపై అసహనం వ్యక్తం చేసిన పూజా హెగ్డే అలా చేయాలనుకుంటే కారు కొనివ్వండి అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే( Pooja Hegde ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

pooja hegde salman khan : ఆ వార్తలపై అసహనం వ్యక్తం చేసిన పూజా హెగ్డే అలా చేయాలనుకుంటే కారు కొనివ్వండి అంటూ?

ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు, తమిళ, హిందీ బాషల సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం మనందరికి తెలిసిందే.

pooja hegde salman khan : ఆ వార్తలపై అసహనం వ్యక్తం చేసిన పూజా హెగ్డే అలా చేయాలనుకుంటే కారు కొనివ్వండి అంటూ?

అయితే ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో పూజ హెగ్డే కాస్త స్లో అయింది.

రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య లాంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.అయినప్పటికి ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

ప్రస్తుతం పూజా చేతుల్లో నాలుగు ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి.ఇకపోతే అసలు విషయంలోకి వెళ్తే.

"""/" / గత కొంతకాలంగా పూజా హెగ్డే గురించి కొన్ని రకాల రూమర్స్ పెద్ద ఎత్తున వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

పూజా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్( Salman Khan ) తో ప్రేమాయణం కొనసాగిస్తోందని వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారు అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో పూజా హెగ్డే కి ఒక నిర్మాత ఖరీదైన కారుని గిఫ్టుగా ఇచ్చినట్లు వార్తలు జోరుగా వినిపిస్తూ ఉండడంతో ఇంతవరకు మౌనంగా సహించిన పూజ హెగ్డే తాజాగా ఆ వార్తలపై స్పందించింది.

నాపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది.వీటన్నింటికీ సమాధానాలు ఇస్తూ కూర్చోలేను.

"""/" / కొన్ని సందర్భాల్లో నా తల్లితండ్రులు ఈ పుకార్లు నిజమేనని నమ్ముతుంటారు.

నిర్మాత నాకు ఖరీదైన కారు కొనిచ్చారని ప్రచారం చేస్తున్నారు.నా గురించి తప్పుగా ప్రచారం చేయాలి అనుకుంటే మీరే ఆ కారు కొనివ్వండి.

"""/" / అప్పుడు ఎలాంటి సమస్య ఉండదంటూ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.

మొత్తానికి తన విషయంలో వస్తున్న వార్తలపై పూజ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది.

సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే కలిసి నటించిన తాజా చిత్రం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్( Kisi Ka Bhai Kisi Ki Jaan ).

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా పూజా హెగ్డే ఏ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.

హల్దీ వేడుకలో వధూవరులకు ఝలక్ ఇచ్చిన కోతి