భారీగా రెమ్యూనరేషన్ పెంచిన పూజా హెగ్డే… ఎంతంటే?
TeluguStop.com
వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ముకుంద సినిమాతో తెరంగేట్రం చేసిన నటి పూజా హెగ్డే.
ముకుంద సినిమాలో తన అందచందాలతో కుర్రకారును మత్తెక్కించింది.తరువాత వరుస సినిమాలలో నటిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.
తరువాత అల్లుఅర్జున్ తో అల వైకుంఠపురములో నటించిన పూజా హెగ్డే బుట్టబొమ్మ పాటతో ఒక్కసారిగా పూజా హెగ్డే స్థాయి అమాంతం లేచిపోయింది.
ఇక ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన పూజాహెగ్డే ఇప్పుడు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోకూడా నటిస్తూ ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే సినిమా సినిమాకు రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేస్తుందట.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్నట్టుగా ఇప్పటికే ముంబయిలోని సెలెబ్రెటీలు నివసించే అత్యంత ఖరీదైన ఏరియాలో ఓ ప్లాట్ తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు పూజా హెగ్డే డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా తమిళ్ స్టార్ హీరో విజయ్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్న పూజా హెగ్డే ఆ సినిమా కోసం రెండున్నర కోట్ల రూపాయలు అందుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే విజయ్ తో సినిమా అంటే ఆ మాత్రం తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏది ఏమైనా పూజా హెగ్డే రెమ్యునరేషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసిందనే చెప్పవచ్చు.
కాకినాడలో ప్లాంట్ .. రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కోరమాండల్ ఇంటర్నేషనల్