Pooja Hegde : చేతిలో ఒక్క సినిమా లేదు… కానీ ఎంతో ప్రశాంతంగా ఉంటున్న పూజా హెగ్డే… కెరియర్ ముగిసినట్టేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి వారిలో నటి పూజా హెగ్డే ( Pooja Hedge ) ఒకరు.

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమా ద్వారా ఈమె హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఇలా మొదటి సినిమా పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోయింది.అనంతరం వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుంద సినిమా( Mukunda )లో కూడా నటించారు.

ఇలా పలు సినిమాలలో నటించిన ఈమెకు ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. """/"/ ఈ క్రమంలోనే ఎలాంటి సక్సెస్ సినిమాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఈమెకు అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చింది.

ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో పూజ నటన కాస్త పరవాలేదు అనిపించుకుంది.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ ( Aravinda Sametha Veereraghava ) చిత్రం మాత్రం ఈమె కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పాలి.

ఎన్టీఆర్(NTR ) హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఇలా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళం హిందీ భాషా చిత్రాలలో కూడా సినిమాలలో నటించే అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగారు.

ఇకపోతే ప్రస్తుతం పూజ హెగ్డే కెరియర్( Pooja Hegde Career ) మాత్రం తిరిగి డేంజర్ జోన్ లో పడిందని తెలుస్తుంది.

"""/"/ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి పూజా హెగ్డేకు ఈ మధ్యకాలంలో ఈమె నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా డిజాస్టర్( Pooja Hegde Flops ) కావడం అలాగే ఈమె కమిట్ అయినా సినిమాల నుంచి కొన్ని కారణాలవల్ల తప్పుకోవడం జరుగుతుంది.

ఇలా స్టార్ హీరోయిన్గా ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి ఈమె చేతిలో ప్రస్తుతం ఒక్క సినిమా కూడా లేకపోవడం గమనార్హం.

ఇలా చేతిలో ఒక్క సినిమా లేకపోయినా పూజ హెగ్డే మాత్రం ఎలాంటి కంగారు లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నారని తెలుస్తోంది.

"""/"/ ఈ విధంగా పూజా హెగ్డే ప్రస్తుతం అవకాశాలు లేకపోయినా, వచ్చిన అవకాశాలను కూడా కొన్ని కారణాలవల్ల మిస్ చేసుకుంటూ ఉంటున్నటువంటి తరుణంలో పలువురు ఈమె కెరియర్ పట్ల పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇలా అన్ని అవకాశాలను వదులుకుంటూ ఉన్నటువంటి పూజా హెగ్డే కెరియర్ డేంజర్ లో పడిందని ఈమె వెంటనే ఒక హిట్ సినిమాలో కనుక నటించకపోతే ఇండస్ట్రీలో కొనసాగడం కష్టమేనని ఇంతటితో ఈమె కెరియర్ కూడా ముగుస్తుంది అంటూ పలువురు పూజా హెగ్డే కెరియర్ పై కామెంట్స్ చేస్తున్నారు.

మరి పూజా హెగ్డే కెరియర్ పట్ల అభిమానులు కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసా..?