పీరియడ్స్ అన్నా పట్టించుకోరు.. హీరోయిన్ నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర సౌత్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో నిత్యామీనన్( Nithya Menen ) ఒకరు.

హీరోయిన్ నిత్యామీనన్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.

అయితే ఈ హీరోయిన్ తాజాగా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం తమిళ మూవీ కాదలిక్క నేరమిల్లై( Kadhalikka Neramillai ) సినిమాతో ఈ బ్యూటీ బిజీగా ఉన్నారు.

తాజాగా నిత్యామీనన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీ తీరుతెన్నుల గురించి నిత్యామీనన్ కీలక వ్యాఖ్యలు చేశారు.హీరోయిన్ల ఆరోగ్యం విషయంలో సినిమా ఇండస్ట్రీ మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.

నా ఫ్రెండ్, డైరెక్టర్, యాక్టర్ మిస్కిన్ కు మాత్రం ఈ విషయంలో మినహాయింపు అని నిత్యామీనన్ చెప్పుకొచ్చారు.

"""/" / హీరోయిన్ల అనారోగ్యం( Heroines Health ) విషయంలో, పీరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరని ఆమె పేర్కొన్నారు.

సినిమా ఇండస్ట్రీలో( Cinema Industry ) చాలా చోట్ల అమానవీయత ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

ఎంత కష్టంలో ఉన్నా ఏదో ఒకటి చేసి షూటింగ్ కు రావాలని చెబుతారని నిత్యామీనన్ పేర్కొన్నారు.

మనం దానికి అలవాటు పడాలని ఏది ఎలా జరిగినా మనం కష్టపడాలని తప్పదని ఆమె వెల్లడించారు.

"""/" / నిత్యామీనన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

నిత్యామీనన్ ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.తెలుగులో నిత్యామీనన్ బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

నిత్యామీనన్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

ఎక్కువ సంవత్సరాల పాటు కెరీర్ ను కొనసాగించిన హీరోయిన్లలో నిత్యామీనన్ కూడా ఒకరు కావడం గమనార్హం.

సంక్రాంతి సినిమాల ఓటీటీ డీల్స్ వివరాలు ఇవే.. ఏ సినిమా ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?