ఆ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తే రెమ్యూనరేషన్ కూడా వద్దు: నిధి అగర్వాల్
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి నాగచైతన్య సరసన నటించిన సవ్యసాచి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటి నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మొదటి సినిమా తనకు ఏమాత్రం హిట్ సాధించలేకపోయినా తదుపరి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరికెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో కాస్త గ్లామర్ డోస్ పెంచిన ఈ ముద్దుగుమ్మ మరింతమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఇక ప్రస్తుతం ఈమె తెలుగులో క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో కూడా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది.
ఇలా తెలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న నిధి అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
సాధారణంగా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కేవలం టాలెంట్ మాత్రమే సరిపోదని టాలెంట్ తో పాటు అందం కూడా ఉండాలని ఈమె తెలిపారు.
"""/"/
అందం లేకపోతే ఇండస్ట్రీలో అవకాశాలు రావని అందుకే తాను గ్లామర్ పాత్రలలో నటించడానికి కూడా ఏమాత్రం వెనకాడనని ఈ సందర్భంగా నిధి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే తనకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చిన తప్పకుండా నటిస్తానని అయితే స్టార్ హీరోల సినిమాలలో నటించినందుకు తనకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా పరవాలేదు తాను రెమ్యూనరేషన్ గురించి ఎలాంటి డిమాండ్ చేయనని ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇలా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తే తనకు ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు వస్తాయని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.
అమ్మ ఫ్రైస్‌ను క్యూట్‌గా దొంగిలించిన బుడ్డోడు.. నవ్వులు పూయించే వీడియో వైరల్!