గజిని చేయడం నా లైఫ్ లో చెత్త నిర్ణయం.. నయన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

స్టార్ హీరోయిన్ నయనతార( Nayanthara ) సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో గజిని సినిమా ఒకటి.

అయితే సినిమా చేయడం నా లైఫ్ లో చెత్త నిర్ణయం అంటూ నెటిజన్లు కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గజిని సినిమాలో నా రోల్ ను కథ చెప్పిన సమయంలో చెప్పిన విధంగా తెరకెక్కించలేదని నయన్ తెలిపారు.

నా ఫోటోలను సినిమాలో భిన్నంగా చూపించారని ఆమె తెలిపారు. """/" / ఈ రీజన్ వల్లే గజిని సినిమా( Ghajini ) చేయడం చెత్త నిర్ణయం అని నేను భావిస్తానని ఆమె పేర్కొన్నారు.

ఈ సినిమా విషయంలో నేను ఎవరినీ నిందించాలని అనుకోనని ఎందుకంటే ఇలాంటి వాటిని గుణపాఠంగా స్వీకరిస్తానని నయనతార చెప్పుకొచ్చారు.

నయనతార కామెంట్ల గురించి ఒక సందర్భంలో మురుగదాస్ సైతం రియాక్ట్ అయ్యారు.గజిని సినిమా కోసం ఎవరి రోల్ ను ప్రత్యేకంగా రాయలేదని ఆయన అన్నారు.

"""/" / ఒక్కోసారి పెద్ద హీరోయిన్లకు సైతం నిడివి తక్కువ ఉన్న రోల్స్ రాయాల్సి వస్తుందని మురుగదాస్( Murugadoss ) వెల్లడించారు.

అది మన చేతుల్లో లేదని ఆయన సమాచారం ఇచ్చారు.అయితే గజిని విషయంలో నయన్ విమర్శలు చేసినా మురుగదాస్ మాత్రం ఆమెకు దర్బార్ సినిమాలో అవకాశం ఇచ్చారు.

దర్బార్ మూవీ తెలుగులో ఫ్లాపైనా 2020 సంవత్సరంలో ఎక్కువ వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా ఈ సినిమా నిలిచింది.

నయనతార నటిగా మంచి పేరును సంపాదించుకున్నా తన యాటిట్యూడ్ తో మాత్రం విమర్శలను మూటగట్టుకుంటున్నారు.

నయనతార ఈ బిహేవియర్ ను మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉందని నెటిజన్లు చెబుతున్నారు.

నయనతార పారితోషికం 10 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది.వయస్సు పెరుగుతున్నా నయనతారకు మూవీ ఆఫర్లు వస్తున్నాయి.

పెళ్లైనా నయనతార జోరు కొనసాగుతుండటం గమనార్హం.

ఈ మధ్యకాలంలో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల అవకుండా ఆగిపోయిన సినిమాలు..!