ఐదేళ్లు నరకం చూశా.. ఆ సమస్యల వల్లే బరువు పెరిగా : నమిత

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సొంతం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన నమిత తొలి సినిమానే హిట్ కావడంతో వరుసగా అవకాశాలను అందిపుచ్చుకున్నారు.

నమిత నటించిన జెమినీ, బిల్లా, సింహా సినిమాలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.కెరీర్ మొదట్లో సన్నగా కనిపించిన నమిత ఆ తరువాత సినిమాల్లో లావుగా కనిపించారు.

లావుగా ఉండటం వల్ల ఆమె లుక్ పై కొన్ని విమర్శలు వచ్చినా ఆమె ఆ విమర్శల గురించి అప్పట్లో స్పందించలేదు.

సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకుంటున్న నమిత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

తాను మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడం గురించి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ ను పెడుతున్నానని.

పది సంవత్సరాల క్రితం తాను బొద్దుగా ఉండేదానినని.అలా ఉండటం వల్ల తాను మానసిక కుంగుబాటుకు లోనయ్యానని ఆమె అన్నారు.

"""/"/ అయితే తాను ఒత్తిడిలో ఉన్నాననే విషయం కూడా తనకు తెలియదని నమిత తెలిపారు.

రాత్రి సమయంలో ఎక్కువగా ఆహారం తీసుకునేదానినని అలా చేయడం వల్లే తాను బరువు పెరిగానని ఆమె పేర్కొన్నారు.

చాలామంది తాను మద్యం తాగడం వల్ల బరువు పెరిగానని అనుకున్నారని కానీ పీసీఓడీ, థైరాయిడ్ సమస్యలే బరువు పెరగడానికి కారణమని ఆమె పేర్కొన్నారు.

ఆత్మహత్య ఆలోచనలు తనను ఎంతగానో బాధించాయని ఆమె తెలిపారు.ఐదు సంవత్సరాల పాటు తీవ్రమైన కుంగుబాటుకు లోనైనట్లు నమిత తెలిపారు.

ఆ తరువాత యోగా ద్వారా తాను మనశ్శాంతిని పొందానని.తాను ఇప్పుడు ఎంతో సంతోషంతో ఉన్నానని నమిత అన్నారు.

ప్రపంచంలో మీరు దేని గురించి వెతుకుతున్నారో అది మీలోనే ఉంటుందని నమిత అన్నారు.

నమిత బరువు పెరగడం గురించి అసలు విషయం తెలిసి ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు.

టైసన్ నాయుడు టీజర్ ఓకే మరి సినిమా పరిస్థితి ఏంటి..?