బిగ్ న్యూస్.. తెలుగు హీరో ప్రేమలో మృణాల్ ఠాకూర్
TeluguStop.com
టాలీవుడ్ లో సీతారామం సినిమా( Seetharam Movie ) తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్( Mrinal Thakur ).
మొదటి సినిమా తోనే నటిగా మంచి పేరు దక్కించుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం నాని తో హాయ్ నాన్న( Hi Nanna ) సినిమా తో పాటు విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ సినిమా( Family Star Movie ) లో నటిస్తోంది.
ఈ రెండు సినిమా లు కాకుండా మరో రెండు సినిమా లు చర్చల దశలో ఉన్నాయి.
హిందీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నా కూడా తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువ గుర్తింపు మరియు గౌరవం లభిస్తున్నాయి కనుక ఏమాత్రం ఆలోచించుకుండా తెలుగు సినిమా లకు కమిట్ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
అయితే తెలుగులో ఈ అమ్మడు పోషించిన పాత్ర లు ఎప్పటికి గుర్తుండి పోయేలా ఉన్నాయట.
"""/" /
ఇక తెలుగు సినిమాల్లో వరుసగా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ తెలుగు కుర్రాడి ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి.
ఆ విషయం నిజమే అన్నట్లుగా ఏకంగా సైమా అవార్డ్( Saima Award ) వేడుక సందర్భంగా అల్లు అరవింద్ వ్యాఖ్యలు చేశాడు.
త్వరలో హైదరాబాద్ కోడలిగా మృణాల్ రాబోతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
బాబోయ్ గతంలో అల్లు అరవింద్( Allu Arvind ) హీరోయిన్ లావణ్య విషయం లో అలాంటి వ్యాఖ్యలే చేశాడు.
ఇప్పుడు మళ్లీ మృణాల్ విషయం లో కూడా అవే వ్యాఖ్యలు చేశాడు అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు.
ఆకట్టుకునే రూపం మృణాల్ సొంతం.లావణ్య పెళ్లి గురించి అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు నిజం అయ్యాయి.
రేపు మెగా ప్రిన్స్ వరుణ్ ను లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతుంది.కనుక అల్లు అరవింద్ చెప్పినట్లు మృణాల్ కూడా త్వరలో ఏదో ఒక బాంబ్ పేల్చుతుందేమో చూడాలి.
ఈ అమ్మడి సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి పీటలు ఎక్కుతుందేమో చూడాలి.
ఓరి బాబోయ్.. ఫేస్‌బుక్‌లో రూ.34 వేలకే ఒకటవ ప్రపంచ యుద్ధం నాటి ఓడ కొనేశాడు..