ఆ వ్యాధి వల్ల ఉన్న ఊరినే వదిలేసి వెళ్లాను.. మమతా మోహన్ దాస్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
స్టార్ హీరోయిన్, స్టార్ సింగర్ మమతా మోహన్ దాస్( Mamata Mohan Das ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తన టాలెంట్ తో మమతా మోహన్ దాస్ ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు.
యమదొంగ సినిమాలో( Yamadonga ) కీలక పాత్రలో నటించడం వల్ల మమతా మోహన్ దాస్ క్రేజ్, పాపులారిటీ అంచనాలకు మించి పేరింది.
అయితే ఆ తర్వాత వరుస ఫ్లాపులు రావడం వల్ల కెరీర్ పరంగా మమతా మోహన్ దాస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు.
కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించినా ఆ సినిమాలు డిజాస్టర్లు కావడం వల్ల కెరీర్ విషయంలో ఈ బ్యూటీ వెనుకబడ్డారు.
అదే సమయంలో మమతా మోహన్ దాస్ క్యాన్సర్( Cancer ) బారిన పడటం కూడా ఈ హీరోయిన్ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.
క్యాన్సర్ వచ్చిన సమయంలో తనకు ఎదురైన పరిస్థితుల గురించి మమతా మోహన్ దాస్ తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
"""/" /
క్యాన్సర్ వ్యాధి వచ్చిన సమయంలో ఆ వ్యాధి గురించి అవగహన కలిగి ఉండటం ముఖ్యమని ఆమె అన్నారు.
క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్లకు చాలా సానుభూతి లభిస్తుందని అయితే అయితే ఆనుభూతి వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుందని మమతా మోహన్ దాస్ కామెంట్లు చేశారు.
అలాంటి సానుభూతి నాకు ఏ మాత్రం అవసరం లేదని మమతా మోహన్ దాస్ చెప్పుకొచ్చారు.
"""/" /
క్యాన్సర్ వచ్చిన సమయంలో తాను సినిమాలను పక్కన పెట్టి ఉన్న ఊరిని వదిలేసి చికిత్స చేయించుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.
తాను కేవలం తల్లీదండ్రుల ఆదరాభిమానాలను మాత్రమే ఆశించానని ఆమె చెప్పుకొచ్చారు.క్యాన్సర్ ను జయించే వరకు కేరళ ( Kerala ) దరిదాపుల్లోకి కూడా వెళ్లకేదని మమతా మోహన్ దాస్ అన్నారు.
మమతా మోహన్ దాస్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
చిన్నారి గుండె ఆగింది.. 8 ఏళ్లకే గుండెపోటుతో బాలిక మృతి.. స్కూల్‌లోనే విషాదం..!