500 మంది హీరోయిన్స్ ని రిజెక్ట్ చేసి ఆ హీరోయిన్ కి అవకాశం ఇస్తే ఏం చేసిందో తెలుసా?
TeluguStop.com
సినిమా అంటేనే ఒక మాయ ప్రపంచం.ఈ మాయ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే ఒక్క సినిమా విజయం ఎందరినో ఆకాశానికి ఎత్తేస్తుంది అలాగే ఒక్క పరాజయం చాలా మందిని పాతాళానికి పడగొడుతుంది.
సినిమా జయాబజాయాల గురించి పక్కన పెడితే ఒకసారి సినిమా హిట్ అయింది అంటే ఆ సినిమాలో నటించిన నటీనటులకు చాలా మంచి పేరు వస్తుంది.
కానీ కొన్నిసార్లు సినిమా ఫ్లాప్ అయినా కూడా అందులో నటించిన కొంతమంది నటీనటులకు అంతే మంచి పేరు వస్తుంది.
ఇండస్ట్రీలో చాలామంది హీరోలు హీరోయిన్లు ఇలాగే నిలదొక్కుకున్న సందర్భాలు ఉన్నాయి.ఇప్పుడు అలాంటి ఒక సందర్భం గురించి తెలుసుకుందాం.
సినిమా ఫ్లాప్ అయినా అవకాశాలు దక్కించుకున్న ఆ హీరోయిన్ ఎవరో చూద్దాం పదండి.
"""/" /
ఎగిరే పావురం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు తొలిసారిగా పరిచయమైంది నటి లైలా.
నటించిన మొదటి సినిమాతోనే అందంతో అల్లరితో అభినయంతో అన్ని రకాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.
అంతేకాదు ఈ ఒక్క సినిమాతోనే లైలాకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.
ఈ చిత్రం విజయం తర్వాత లైలా మరికొన్ని సినిమా అవకాశాలను చిత్రాలను కూడా దక్కించుకుంది.
టాలీవుడ్ లో పూర్తిగా నటించడం మానేసిన లైలా గోవాలో పుట్టింది.లైలా తండ్రి పైలెట్ , దాంతో రకరకాల ప్రాంతాలను ఎక్కువగా చూస్తూ ఉండేవారు.
అలా ఓసారి ఒక అందమైన అమ్మాయి పైన తండ్రి చూపు పడింది.మనం ఎంతగానో ఆరాధించారు ఆమె పేరు లైలా కావడంతో తనకు పుట్టిన అమ్మాయి పేరు కూడా లైలా అనే పెట్టుకున్నారట.
పదవ తరగతి నుంచి మాడలింగ్ అన్నా కూడా ఇష్టం పెంచుకున్న లైలా అనేక మోడలింగ్ అవకాశాలను సైతం దక్కించుకుంది.
తన ఫోటోలను ఓసారి బాలీవుడ్ దర్శకుడైన మహమ్మద్ చూశాడట.ఆయన సినిమాలో నటించే అవకాశం లైలాకు ఇచ్చారట.
"""/" /
మోడలింగ్ అంటే ఇష్టమే కానీ సినిమా రంగంపై లైలాకు మంచి అభిప్రాయం లేకపోవడంతో మహమ్మద్ ఇచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించిందట లైలా.
కానీ మహమ్మద్ తీస్తున్న సినిమా కోసం అప్పటికే ఏకంగా 500 మంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశాడట.
దాంతో ఎలాగైనా లైలా తో ఆ సినిమాలో నటింపజేయాలని భావించి లైలా తండ్రిని ఒప్పించి ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నాడట.
"""/" /
అంతేకాదు మహమ్మద్ తన కొడుకుని హీరోగా పెట్టి దుష్మన్ కా దునియా అనే చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకొని లైలాని హీరోయిన్ గా తీసుకున్నారు.
ఈ సినిమాలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ హీరోలు సైతం నటించారు.
అనేక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం దారుణమైన డిజాస్టర్ కావడం విశేషం.
ఈ సినిమాలో లైలా నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.ఆ తర్వాత ఆమెకు వరుస సినిమా అవకాశాలు కూడా వచ్చి బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
రామోజీ ఫిల్మ్ సిటీ లో రాజమౌళి మహేష్ బాబు తో భారీ ఫైట్ చేయించబోతున్నారా..?