అభిమానులకు ఊహించని షాకిచ్చిన కీర్తి సురేష్.. పెళ్లి తర్వాత యాక్టింగ్ కు గుడ్ బై?

తెలుగు బుల్లితెర పేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

ఇకపోతే ప్రస్తుతం కీర్తి సురేష్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అలాగే తమిళంలో జయం రవి సరసన సైరన్ సినిమాలో నటిస్తోంది.తెలుగులో నాని హీరోగా నటించిన దసరా సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

తమిళంలో ఉదయనిది స్టాలిన్ సరసన నటించిన మామన్నన్ సినిమా కూడా ఇటీవల షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా కీర్తి సురేష్ కి సంబంధించిన ఒక వార్త తెగ చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని సినిమాల తర్వాత ఆమె గుడ్ బాయ్ చెప్పబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

త్వరలోనే పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బాయ్ చెప్పబోతోందట. """/"/ మరి ఈ వార్తలు నిజాలు తెలియాలి అంటే కీర్తి సురేష్ స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే.

అంతేకాకుండా కీర్తి సురేష్ హోంబలే నిర్మాణ సంస్థలో ఒక సినిమా అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ సినిమా హీరోయిన్ ఓరియంటెడ్ కథ చిత్రంగా తెరకెక్కబోతోంది అని సమాచారం.అయితే ఆ సినిమాకు దర్శకుడు ఎవరు? హీరో ఎవరు అన్న విషయాలపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు.

డాన్సర్స్ తో కలిసి చిందేసిన ఏనుగు.. వీడియో వైరల్