నన్ను ప్రమాదం నుంచి కాపాడింది ఆమెనే… విజయ్ ఆంటోనీ షాకింగ్ కామెంట్స్!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని ( Vijay Antony ) హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బిచ్చగాడు( Bichagadu ).

2016 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.

ఈ సినిమా మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా బిచ్చగాడు 2( Bichagadu 2 ) సినిమాని తెరకెక్కించారు.

త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా మే19వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.

"""/" / హీరో విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో హీరో విజయ్ సరసన కావ్య థాపర్( Kavya Thapar ) హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఈవెంట్లో భాగంగా హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ హీరోయిన్ కావ్య గురించి పలు విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.హీరోయిన్ కావ్య నన్ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందని అందుకు ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

"""/" / ఇక ఇండస్ట్రీలోకి వచ్చిన మొదటి నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా విజయ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

బిచ్చగాడు సినిమా తర్వాత మరో బ్లాక్ బస్టర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈయన ధీమా వ్యక్తం చేశారు.

బిచ్చగాడు సినిమా మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే బిచ్చగాడు 2 సినిమా మాత్రం సిస్టర్ సెంటిమెంటుతో( Sister Sentiment ) మీ ముందుకు రాబోతుందని విజయ్ తెలిపారు.

ఈ సందర్భంగా విజయ్ ఆంటోని చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వరలక్ష్మి ఫస్ట్ లవ్ నేను కాదు… సంచలన వ్యాఖ్యలు చేసిన నికోలయ్?