ఏంటి? కాజల్ పెళ్లి డ్రెస్సు కోసం అంతమంది అన్ని రోజులు కష్టపడ్డారా?

మిస్ చంద‌మామ కాస్త‌.మిసెస్ చంద‌మామైంది.

టాలీవుడ్ లో ల‌క్ష్మీ క‌ల్యాణంతో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల బొమ్మ .

మిత్ర‌విందగా మురిపించి ఓ ఇంటి కోడ‌లైంది.ముంబై తాజ్ హోట‌ల్ లో కాజ‌ల్ త‌న ప్రియుడు గౌత‌మ్ కిచ్లూతో మూడు ముళ్లు వేయించుకుంది.

క‌రోనా కార‌ణంగా అతికొద్ది మంది బంధువుల స‌మ‌క్షంలో కాజ‌ల్ పెళ్లి హిందూ సాంప్ర‌దాయంలో జీల‌క‌ర్ర‌బెల్లంతో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

ఈ వివాహంలో వ‌ధువ‌రులు ధ‌రించిన పెళ్లి క్యాస్టూమ్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

స్క‌ర్ట్స్, జీన్స్ లంటూ టెండ్రీ లుక్ తో క‌నిపించిన చందమామ పెళ్లిలో లెహంగా ధ‌రించి ప‌దహార‌ణాల తెలుగ‌మ్మాయిలా మారిపోయింది.

సాంప్ర‌దాయం, ఫ్యాష‌న్ రెండు క‌ల‌గ‌లిసిన అవుట్ ఫిట్ లోని లెహంగా తో కాజ‌ల్ అద‌ర‌గొట్టిన పోటోలు నెట్టింట్లో సంద‌డి చేస్తున్నాయి.

ముఖ్యంగా కాజ‌ల్ ధ‌రించిన లెహంగా గురించి చెప్పాలంటే సాధార‌ణంగా ప‌ట్టు, నెట్, రాసిల్క్ ల‌ను యూజ్ చేస్తారు.

అవి కాకుండా ఆర్గంజా, కేప్రేల‌లో లెహంగాలు కుట్టించుకుంటారు.కాజల్ సైతం లెహంగా ఫ్లోర‌ల్ డిజైన్ లో జ‌ర్దోసి వ‌ర్క్ చేయించింది.

ఇటీవ‌ల రానా భార్య మిహికా బ‌జాజ్,సోన‌మ్ కపూర్, మీరా క‌పూర్ లు త‌మ పెళ్లిలో ప్ర‌ముఖ డిజైన‌ర్ అనామికా క‌న్నా డిజైన్ చేసిన లెహంగాను ధ‌రించారు.

కాజ‌ల్ సైతం త‌న పెళ్లిలో అనామిక డిజైన్ చేసిన లెహంగా తో అంద‌ర్ని ఆక‌ర్షించింది.

అనామిక లెహంగా ఫ్లోర‌ల్ డిజైన్ లో జ‌ర్దోసి వ‌ర్క్ చేయ‌డానికి 20మంది వర్క‌ర్స్ తో నెల‌రోజుల పాటు స‌మ‌యం ప‌ట్టింది.

దీంతో పాటు తాళిక‌ట్టే స‌మ‌యంలో సునీతా షెకావ‌త్ చేసిన ఆభ‌ర‌ణాల‌తో కాజ‌ల్, అనితా డోంగ్లే తయా‌రు చేసిన తెల్ల‌రంగు షేర్వాణీలో గౌత‌మ్ తళుక్కుమ‌న్నాడు.

ఈ షేర్వాణి ధ‌ర సుమారు రూ.ల‌క్షా15వేలు ఉండ‌గా.

పెళ్లికి ముందురోజు మెహందీ ఫంక్ష‌న్ లో ధ‌రించిన ఆకుప‌ర్చ కుర్తా రూ.24 వేలుగా ఉంది.

ఈ సంద‌ర్భంగా క‌రోనా స‌మ‌యంలో పెళ్లి ప‌నులు చాలా క‌ష్టంతో కూడుకున్న ప‌ని.

చాలా మందిని మిస్స‌య్యా.త్వ‌రలోనే అంద‌ర్ని క‌లుసుకుంటానంటూ చెప్పింది మిసెస్ కాజ‌ల్ అగ‌ర్వాల్.