కాజల్‌ చేసుకొబోతున్న భర్త గురించి సోషల్‌ మీడియా ప్రచారం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి గత ఐదు సంవత్సరాలుగా మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే.

మీడియాలో కాజల్ పెళ్లి విషయమై మరియు ప్రేమ విషయమై అనేక పుకార్లు షికార్లు చేశాయి.

చెల్లి నిషా అగర్వాల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసినా సక్సెస్ కాకపోవడం వల్ల ఆమె పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో సెటిల్ అయిపోయింది.

ఆ సమయంలోనే కాజల్ పెళ్లి విషయంలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

హీరోయిన్ గా చాలా బిజీగా ఉండడంతో పాటు ఆ సమయంలో కెరీర్ పీక్స్ లో ఉండడం వల్ల పెళ్లి విషయాన్ని పక్కకు పెట్టింది.

అప్పటి నుండి కూడా కాజల్ అగర్వాల్ ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

ఆ వార్తలను ఎప్పటికప్పుడు కాజల్ టీం ఖండిస్తూనే ఉంది.అయినా వార్తలు మాత్రం ఆగలేదు.

ఎట్టకేలకు కాజల్ అగర్వాల్ తన పెళ్లి విషయమై అధికారికంగా ప్రకటించింది.ఇదే నెలలో తన పెళ్లి అంటూ కాజల్ ప్రకటించడంతో అంతా సంతోషంగా కూడా ఉన్నారు.

కాజల్ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి పేరు గౌతం కుచ్లు.అతడు ముంబై బేస్డ్ ప్రముఖ వ్యాపారవేత్తగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

పలు వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.కాజల్ తో అతడికి చాలా కాలంగా పరిచయం ఉందని ఇద్దరు వారివారి వృత్తుల్లో బిజీగా ఉండడం వల్ల పెళ్లిని ఇన్నాళ్లు వాయిదా వేసినట్లు గా చెబుతున్నారు.

వ్యాపారాల్లో గౌతమ్ చాలా చురుకుగా ఉంటాడని పలు అవార్డులు మరియు రివార్డులను కూడా అందుకున్నాడని అతడి గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది కనుక కాజల్ గౌతమ్ ను పొందడం లక్కీ అంటున్నారు.

అలాగే కాజల్ ని పెళ్లి చేసుకోబోతున్నందుకు గౌతమ్ కూడా చాలా లక్కీ అంటూ నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వేలానికి హిట్లర్ సన్నిహిత మిత్రుడి విల్లా.. దాని విశేషాలు ఇవే..?