తొమ్మిదో నెలలోకి అడుగుపెట్టిన ఇలియానా… ఇబ్బంది కలుగుతుందంటూ పోస్ట్?

గోవా బ్యూటీ ఇలియానా ( Ileana )పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నాను అంటూ ఓ వార్తను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు.

ఇలా పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

అయితే ఇలియానా ప్రెగ్నెంట్( Pregnant ) అవ్వడానికి కారణమైనటువంటి ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఈమె మాత్రం తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని సస్పెన్స్ పెట్టారు.

అయితే ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను ఈమె అభిమానులతో పంచుకుంటున్నారు.

"""/" / ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా తన బేబీ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో తనకు కలిగే ఫీలింగ్స్ గురించి కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ వచ్చారు.

ఇకపోతే సోషల్ మీడియా వేదికగా తన బిడ్డకు తండ్రి అయినటువంటి వ్యక్తి ఫోటోలను ఈమె షేర్ చేసినప్పటికీ ఆయన ఎవరన్న విషయం గురించి క్లారిటీ లేకుండా షేర్ చేస్తున్నారు.

అంతేకాకుండా తన గురించి చాలా ఎమోషనల్ పోస్టులు కూడా చేశారు.ఆ వ్యక్తి గురించి ఈమె అభిమానులకు పూర్తి వివరాలు తెలియకుండా హింట్ ఇస్తూ వస్తున్నారు.

"""/" / ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం తాను 9వ నెలలోకి అడుగు పెట్టానని అయితే ఏదైనా పని చేయాలన్నా కూడా తనకు చాలా నీరసంగా అనిపిస్తుందని చాలా ఇబ్బంది కలుగుతుంది అంటూ ఈ సందర్భంగా తొమ్మిదవ నెలలో తాను పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఈమె 9వ నెల ప్రెగ్నెన్సీ( 9Month Pragency ) అని చెప్పడంతో మరి కొద్ది రోజులలో ఇలియానా పండంటి పాపకు లేదా బాబుకు జన్మనివ్వబోతున్నారు అంటూ కొందరు ఈ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు.

ఆ విషయంలో రేవంత్ డకౌట్ ! హరీష్ సెటైర్లు