ఆ సాంగ్ వచ్చే సమయానికి ప్రభాస్ థియేటర్ కు పంపాడు.. హంసా నందిని కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం కెరీర్ పరంగా టాప్ లో ఉండగా ప్రభాస్ సినిమాలు బిజినెస్ పరంగా ఏ స్థాయిలో అదరగొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రభాస్ సినీ కెరీర్ లో మిర్చి సినిమా స్పెషల్ మూవీ కాగా ఈ సినిమాలో టైటిల్ సాంగ్ లో హంసా నందిని డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

హంసా నందిని ప్రభాస్ గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

"""/" / మిర్చి మూవీ రిలీజైన సమయంలో బిజీగా ఉన్నానని హంసా నందిని( Hamsa Nandini ) అన్నారు.

దీంతో సినిమా చూడడం కుదరలేదని హంసా నందిని చెప్పుకొచ్చారు.ఒకరోజు ప్రభాస్ ను కలిసిన సమయంలో సినిమా చూశావా మన మూవీ సూపర్ హిట్ గా నిలిచిందని ప్రభాస్ చెప్పారని హంసా నందిని పేర్కొన్నారు.

నేను మిర్చి మూవీ చూడలేదని చెప్పడంతో వెంటనే సినిమాకు టికెట్ బుక్ చేసి సాంగ్ వచ్చే టైమ్ చెప్పారని హంసా నందిని పేర్కొన్నారు.

"""/" / ఆ సమయానికి నేను థియేటర్ కు వెళ్లగా ఆడియన్స్ ఆ సాంగ్ ను చూసి ఎంజాయ్ చేయడం నాకు ఆనందాన్ని కలిగించిందని హంసా నందిని చెప్పుకొచ్చారు.

నేను సినిమా మొత్తం చూసి వచ్చానని ఆమె పేర్కొన్నారు.నేను నటించిన సినిమాలలోని సాంగ్స్ కు మంచి గుర్తింపు వచ్చిందని హంసా నందిని వెల్లడించారు.

ఇప్పటికీ కొందరు వాటిని రింగ్ టోన్లుగా పెట్టుకున్నారని ఆమె పేర్కొన్నారు.హంసా నందిని చెప్పిన విషయాలు విని ప్రభాస్ గురించి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రభాస్ తర్వాత సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేసి నెక్స్ట్ లెవెల్ లో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రభాస్ కెరీర్ ప్లాన్స్ అద్భుతంగా ఉండగా ఒక్కో మెట్టు ఎదుగుతున్న ఈ హీరో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకుంటారేమో చూడాలి.

ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే..?