పుష్ప 2 ఐటెం కోసం ఆ హీరోయిన్ రంగంలోకి

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రశ్మిక మందాన హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా సినిమా పుష్ప.

ఈ సినిమా థియేటర్లలో విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టింది.సౌత్ తో పాటు నార్త్ లోనూ ఓ రేంజిలో హిట్ అందుకుంది.

అన్ని భాషల్లోనూ బన్నీ మూవీని జనాలు బాగా ఆదరిస్తున్నారు.ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది.

ఈ సినిమా రెండు భాగాలుగా జనాల ముందుకు వస్తుంది.ఇప్పటికే తొలి పార్ట్ మంచి విజయాన్ని అందుకోగా.

రెండు పార్ట్ త్వరలో విడుదల కానుంది.భారీ అంచనాలతో వచ్చిన పుష్ప ది రైజ్ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా తొలి రోజు పెద్దగా పాజిటివ్ టాక్ రాలేదు.

కానీ నెమ్మదిగా పాజిటివ్ టాక్ మొదలైంది.అదే సమయంలో మరే పెద్ద హీరో సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకు జనాల నుంచి మంచి స్పందన వచ్చింది.

మొత్తంగా ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్ మూవీగా నిలిచింది.

సినిమా తొలి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది.వరుసగా మంచి వసూళ్లను చేపట్టింది.

అటు ఫిబ్రవరి నుంచి పుష్ప-2 సినిమా షూటింగ్ కొనసాగనుంది.తొలి షెడ్యూల్ లోనే కొన్ని ఇట్రెస్టింగ్ సీన్లు ఫ్లాన్ చేస్తున్నాడట.

"""/"/ అటు పుష్ప-1లో సమంతాతో ఐటెం సాంగ్ చేయించిన సుకుమార్.పార్ట్ -2లో మరో క్రేజీ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే టాలీవుడ్ నుంచి కాకుండా బాలీవుడ్ నుంచి ఈ బ్యూటీని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారట.ఈ సినిమా తొలి షెడ్యూల్ లోనే ఐటెం సాంగ్ పూర్తి చేసే అవకాశం ఉందట.

అయితే ఈ ఐటెం బ్యూటీ ఎవరు? అనేది ఇంకా బయటకు మాత్రం తెలియలేదు.

త్వరలోనే ఈ అమ్మడు ఎవరు అనేది తెలియనుంది.

పాన్ ఇండియాలో ఈ ఇద్దరు హీరోలు బాగా వెనకబడిపోయారా..?