ఈ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ధరించిన చీర ఖరీదు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే?
TeluguStop.com
రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడీ సినిమా ద్వారా డింపుల్ హయాతి టాలీవుడ్ ప్రేక్షకులలో పాపులారిటీని పెంచుకున్నారు.
ఖిలాడీ సినిమా ఫ్లాప్ అయినా ఈ సినిమా ద్వారా డింపుల్ హయాతి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
అయితే ఈ టాలెంటెడ్ బ్యూటీ కెరీర్ తొలినాళ్లలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.సినిమా ఛాన్స్ కావాలని ఈ నటి ప్రొడక్షన్ ఆఫీస్ ల చుట్టూ తిరగగా స్కిన్ టోన్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి.
ఎన్నో తిరస్కారాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో డింపుల్ హయాతి ముందడుగులు వేశారు.ప్రస్తుతం డింపుల్ హయాతికి చెప్పుకోదగ్గ స్థాయిలోనే సినిమా ఆఫర్లు వస్తున్నాయి.
2017 సంవత్సరంలో విడుదలైన గల్ఫ్ అనే సినిమా ద్వారా డింపుల్ హయాతి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
హైదరాబాద్ లో జన్మించిన డింపుల్ హయాతి యురేక అనే సినిమాలో నటించగా ఆ సినిమా ఫ్లాప్ అయింది.
గద్దలకొండ గణేష్ సినిమాలో డింపుల్ హయాతి చేసిన జర్ర జర్ర పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
తాజాగా డింపుల్ హయాతి చీరలో ఫోటో దిగగా ఆమెకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
డింపుల్ హయాతి ధరించిన ఈ చీర ఖరీదు ఏకంగా 34,800 రూపాయలు కావడం గమనార్హం.
చీరలో హయాతి చాలా అందంగా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. """/" /
మనస్సులో భయాన్ని పెట్టుకుని కాదని మనస్సు నిండా కలలను నింపుకుని ముందుకు సాగాలని ఆమె చెప్పుకొచ్చారు.
మనపై మనకు ఉండే నమ్మకమే లక్ష్యాన్ని చేరుస్తుందని ఆమె కామెంట్లు చేశారు.డింపుల్ హయాతి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
డింపుల్ హయాతి కెరీర్ లో సక్సెస్ సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.డింపుల్ హయాతికి రోజురోజుకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
ఈ బాలుడు మృత్యుంజయుడా.. మూడో అంతస్తు నుంచి పడినా బతికే ఉన్నాడు.. వీడియో చూడండి!